Bigg Boss7 Rathika Rose: రతిక(Ritika) రోజ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఒక మోడల్ గా తన కెరియర్ ను ప్రారంభించి. సినిమాల్లో,(Cinema) టీవీ షోస్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరించింది. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’, ‘నారప్ప’, ‘బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది’ ఇలా పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దు గుమ్మ తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది.
బిగ్ బాస్(Big Boss) స్టేజ్ పైకి వచ్చిన ఈ బ్యూటీ చాలా హైపర్ యాక్టీవ్ గా కనిపించింది. ఇంట్లో కూడా అదే జోష్ తో ఆట మొదలు పెట్టింది. మొదటి రోజే బిగ్ బాస్ రతికకు ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ లో రతికా మీరు ఎవరినైనా మిస్ అవుతున్నారా అని అడగగా రతిక అవును బిగ్ బాస్ ఒకరిని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పింది.
దాంతో రతికకు బ్రేక్ అప్ అయినట్లు, తనను మిస్ అవుతున్నట్లు చెప్పింది. ఇక రతిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్(Boy Friend) ఎవరా.. అని సోషల్ మీడియాలో ఒక బజ్ వినిపించింది. అంతే కాదు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి నామినేషన్స్ లో కూడా డిస్కషన్ జరిగింది.
రతిక బిగ్ బాస్ హౌస్ లో గొడవలు పడుతూ, అనవసరమైన ఆర్గుమెంట్స్ చేస్తూ తన పై ఆడియన్స్ లో ఒక బజ్ క్రియేట్ చేసుకుంది. కానీ పల్లవి ప్రశాంత్ పట్ల తాను వ్యవహరించిన తీరు తనకు చాల నెగిటివిటీ ని తీసుకొచ్చింది. ఆమె ఆట పై అసంతృప్తి చెందిన ప్రేక్షకులు తనను హౌస్ నుంచి ఎలిమినేట్ చేసారు.
ఎలిమినేట్ అయ్యాక స్టేజ్ పైకి వచ్చిన రతికను ‘హార్ట్ బ్రేక్ నుంచి బయటకు వచ్చావా’ అని నాగార్జున అడగగా దానికి రతిక అవును అని నవ్వేస్తుంది. ఇంత త్వరగా బయటకి వస్తాననుకోలేదు, చాలా బాధగా ఉంది అంటూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడు బిగ్ బాస్ ఇన్ని రోజులు మీరు మా కోసం పాటలు పాడారు ఇప్పుడు మీ కోసం ఒక పాట వినిపిస్తాము అని సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) పాడిన ‘పిల్లా ఆ .. పిల్లా ఆ … భూలోకం దాదాపు సాంగ్ ప్లే చేస్తారు.
ఇప్పటికే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రతిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్(Buzz) నడిచింది. బిగ్ బాస్ స్టేజ్ పై ఆ పాట వేసే సరికి అది నిజమే అన్నట్లు నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.. అది కాకుండా రతిక బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రతిక కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే వీళ్లిద్దరు కలిసి ‘హే పిల్ల ‘ ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, కొన్ని రోజుల తర్వాత ఏవో కారణాల చేత ఇద్దరికీ బ్రేక్ అప్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Bigg Boss7 Promo : అంతా శుభ శ్రీకి ఫెవర్.. యావర్ టార్గెట్ అయ్యాడా..?