Kerala: ఓ బైకర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రెచ్చిపోయాడు..చివరికి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అసలేం జరిగిందంటే.. కేరళ – కొచ్చిలోని ములవుకాడ్ దగ్గర ఓ బైకర్ అతివేగంగా దూసుకెళ్లాడు. అటు వైపు సైకిల్‌పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టాడు. అనంతరం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ కిందికి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో బైకర్ తీవ్రంగా గాయపడ్డాడు.
Also Read: తాటి ముంజలు కొట్టిన కేఏ పాల్.. రాష్ట్రం అప్పులు తీరాలంటే ఇలా చేయండి..!
వెంటనే అలర్ట్ అయిన స్థానికులు హుటాహుటిన బైకర్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. బైకర్లు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తమతో పాటు ఇతరులకు కూడా ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు.