బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ ఎవరు దొరుకుతారా వారి భరతం పడదామని వెయిట్ చేస్తూంటుంది. అది సల్మాన్ ఖాన్ అయినా..షారూక్ ఖాన్ అయినా ఆమెకు ఎవరైనా ఒకటే. ఛాన్స్ వచ్చిందా..ఏకి పారేశామా? అన్నట్లే ఉంటుంది ఆమె వ్యవహారం.
ఆమె కాలు దువ్వెది కూడా చిన్న చితకా స్థార్స్ తో కాదు. బడా స్టార్స్ తోనే. స్టార్ కిడ్స్ పైనే విరుచుకుపడుతుంది. ఆమెకు బాలీవుడ్ బడా డైరెక్టర్ కరణ్ జోహర్ అంటే అసలు పడదు. ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడా? గట్టిగా ఇచ్చిపడేదాం అని చూస్తూంటుంది.
అసలు ఆయనకు ఇవ్వాల్సిన కనీస మర్యాద, గౌరవం కూడా ఇవ్వదు. కొద్ది రోజుల క్రితం ఆయన తీసిన రాఖి ఔర్ రాణి కి ప్రేమ్ కహాని చిత్రం గురించి ఆమె చేసిన దారుణమైన ట్రోల్స్ ని ఇప్పటికీ బాలీవుడ్ వర్గాలు మరచిపోలేదు.
ఈ క్రమంలోనే కంగనా మరోసారి రణబీర్ మీద విరుచుకుపడింది. తనతో డేటింగ్ కోసం రణబీర్ చాలా ట్రై చేశాడని పెద్ద షాక్ ఇచ్చింది. అయితే ఇక్కడ రణబీర్ పేరుని కంగనా ప్రస్తావించలేదు. ఓ మాఫియా స్టార్ అంటూ పేర్కొంది. క్వీన్ టైమ్ లో అయితే ఆ మాఫియా స్టార్ కి ఇంకా పెళ్లి కాలేదు.
అప్పటికే నా బ్యాగ్రౌండ్ మొత్తం సేకరించి నా వెనుక పడడం మొదలు పెట్టాడు. నేనంటే పిచ్చ ఇష్టం. నేను షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. డేటింగ్ అంటూ వేధించేవాడు. కానీ నేను ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. దానితో నా మీద రకరకాల ప్రయోగాలు కూడా చేశాడు.
దానితో నా సోషల్ మీడియా హ్యాక్ చేయించి కూడా నన్ను లొంగదీసుకోవాలని చూశాడు. అతను నాతో చాట్ చేయడానికి వేర్వేరు నంబర్లు, అకౌంట్ నెంబర్స్ ఉపయోగించేవాడు. అంతటితో ఆగకుండా వారు పెద్ద మొత్తంలో నకిలీ టికెట్లు కొంటారు. కలెక్షన్లను కూడా తప్పుగా చూపిస్తారు. అలాగే పర్సనల్ విషయాలపై గూఢచర్యం చేస్తారు. వాట్సాప్ డేటాను కొనుగులో చేసి మన వ్యక్తిగత విషయాలపై ఎల్లప్పుడూ నిఘా పెడతారు. వాళ్లు కేవలం టాలెంట్ లేని స్టుపిడ్స్ కాదు. నేర ప్రవృత్తి ఉన్న భయంకరమైన నేరస్థులు. దయచేసి ముంబై సైబర్ క్రైమ్ యాక్షన్ తీసుకోండి” అంటూ ఆమె కోరింది.
ఇక సరిపెడితే చాలదు అనుకుందో ఏమో రణబీర్ కి పుట్టిన పాప గురించి కూడా కంగనా పేర్కొంది. అతని పెళ్లి ఒక ఫేక్. అతనికి పుట్టిన పాప సినిమాను ప్రమోట్ చేసే సాధానం అని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఎవరైనా ఇంత అనైతికంగా ఉంటారా అని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని కంగనా తెలిపింది.
“వాళ్లు మనుషులు కాదు. రాక్షసులు. అందుకే నేను వారిని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాను. ధర్మం ముఖ్య ఉద్దేశం అధర్మాన్ని నాశనం చేయడమే. అదే భవద్గీత లో శ్రీ కృష్ణుడు చెప్పినట్లుగా. నేను అదే చేస్తున్నాను” అని కంగనా వెల్లడించింది.