రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ఎత్తివేత : కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు తిరిగి పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. గతంలో ఆయనపై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. దీంతో నేడు(ఆగస్టు 7) జరిగే లోక్‌సభ సమావేశాలకు రాహుల్ హాజరుకానున్నారు.