Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు. విజేతను ప్రకటించిన అనంతరం అన్నపూర్ణ స్థూడియో ముందు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బీభత్సము సృష్టించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్ల పై దాడి చేస్తూ.. కారు అద్దాలను పగలగొట్టారు. అంతే కాదు ప్రభుత్వ ఆస్తులైన ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంశం చేశారు. ఈ ఘటన పై స్పందించిన పోలీస్ యాజమాన్యం చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రశాంత్, అతని అభిమానుల పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా పోలీసులు అన్నపూర్ణ స్థూడియో ముందు జరిగిన గొడవ కారణంగా ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అరెస్ట్ కు ముందు పల్లవి ప్రశాంత్..తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న ప్రచారాల పై స్పందించాడు. దీనికి సంబంధించి మీడియా ఛానెల్స్ ముందు మాట్లాడాడు. “తాను ఏ తప్పు చేయలేదు.. ఎక్కడికి వెళ్లలేదని.. ఇంట్లోనే ఉన్నానని తెలిపాడు. కొంత మంది మీడియా ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇవ్వలేదని.. నన్ను తప్పుగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. దీని వెనుక ముగ్గురు, నలుగురు ఉన్నారు. నేను వాళ్ళ ఫొటోలు కూడా పెడతాను. నాకు ఏదైనా జరిగితే వాళ్ళే బాద్యులని తెలిపాడు. నన్ను తప్పుగా చూపించడానికి ట్రై చేస్తున్నారని మీడియా ముందు ఏడ్చాడు. ప్రశాంత్ తల్లి కూడా మాట్లాడారు. నా బిడ్డకు ఎప్పుడు కష్టాలే.. ఛానెల్ వాళ్ళు ఇలా చేయడం న్యాయం కాదని కన్నీళ్లు పెట్టుకుంది”.
Also Read: Anchor Shiva: ప్రశాంత్ అసలు రూపం ఇదే.. యాంకర్ శివ ఇన్స్టాగ్రామ్ పోస్ట్..!