Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్స్టా అకౌంట్ మిస్సింగ్.. సాధారంగానే సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటాడు ప్రభాస్. ఏదైనా మూవీ ప్రమోషన్స్ లేదా ముఖ్యమైన విషయాన్నీ షేర్ చేయడానికి మాత్రమే తన సోషల్ మీడియా వేదికను వాడతారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఇన్స్టా అకౌంట్ కనిపించడం లేదు. ఇన్స్టాలో ప్రభాస్ ఐడీ తో సెర్చ్ చేస్తే అకౌంట్ అందుబాటులో లేనట్లు కనిపిస్తుంది. ప్రభాస్ పేరుతో సెర్చ్ చేసినప్పుడు కేవలం ఫ్యాన్ పేజెస్ మాత్రమే కనిపిస్తున్నాయి కానీ అఫీషియల్ పేజ్ మాత్రం అందుబాటులో లేదనే సందేశం వస్తుంది. దీంతో ప్రభాస్ ఇన్స్టా అకౌంట్ మిస్సింగ్ అన్నట్లుగా తెలుస్తుంది.
గతంలో ఒకసారి ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్ కూడా హ్యకైనా విషయం తెలిసిందే. ప్రభాస్ ఫేస్ బుక్ హ్యకైన సమయంలో.. మనుషులు దురదృష్టవంతులు అంటూ ప్రభాస్ అకౌంట్ నుంచి హ్యాకర్స్ ఒక మెస్సేజ్ పెట్టారు. దాంతో అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కాస్త కంగారు పడ్డారు.. కానీ ప్రభాస్ తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అంటూ ఒక ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్ ఇన్స్టా కనిపించకపోవడం వెనుక హ్యాకర్ల హస్తం ఉందా లేదా అకౌంట్ డీయాక్టివేట్ చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రభాస్ ఇన్స్టా అకౌంట్ మిస్సింగ్ పట్ల తన అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, కల్కీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. రాజా డీలక్స్ , స్పిరిట్ పలు సినిమాల్లో కూడా నటించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ 22 డిసెంబర్ లో విడుదల కానుంది. నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కీ’ 2024లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ దీపికా, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించారు.
Also Read: Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కు పండగే.. శంకర్ దాదా M.B.B.S. రీ రిలీజ్..!