POTTEL Movie: టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ తెలంగాణకు చెందిన అచ్చ తెలుగు అమ్మాయి. అనన్య మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో అనన్య తన నటనకు సినీ క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంశలు అందుకుంది. మల్లేశం సినిమా అనన్యకు బాగా గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత అనన్య పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ (Vakeel Saab) సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మరింత పాపులర్ అయ్యింది.
ప్రస్తుతం అనన్య(Ananya Nagalla) సాహిత్ మోత్ఖురి దర్శకత్వంలో రాబోతున్న పొట్టేలు చిత్రంలో (Pottel Movie) నటిస్తోంది. బంధం రేగడ్’, ‘సవారీ’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు సాహిత్ మోత్ఖురి. ఎన్ఐఎస్ఏ ఎంటర్టైమెంట్స్, సన్నిది క్రియేషన్స్ బ్యానర్ పై నిశాంక్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, యువ చంద్ర కృష్ణ జంటగా కనిపించనున్నారు. అజయ్, ప్రియాంక శర్మ, జీవన్, రియాజ్, విక్రమ్, థానస్వి చౌదరి, నోయెల్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. తెలంగాణ కల్చర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.
Also Read: KBC : రేవంత్రెడ్డి పై ‘KBC’ లో అబితాబ్ ప్రశ్న.. దిక్కులు చూసిన యువతి..!
తాజాగా చిత్ర బృందం సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ లో తెలంగాణ యాసలో పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. తెలంగాణ ప్రత్యేక పండుగ బోనాల వేడుకల్లో.. అమ్మవారి ముందు పొట్టేలును బలివ్వడం, జాతర విజువల్స్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. తెలంగాణ కల్చర్ ను (Telangana Culture) ఎక్కువగా ప్రతిభింబించేలా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
POTTEL 🔥#ananyanagalla pic.twitter.com/Oz88RZXAaZ
— Ananya Nagalla (@AnanyaNagalla) December 27, 2023