Keyboard Password Hacking ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేనిదే పూట గడవదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునేంత వరకు స్మార్ట్‌ఫోన్ అనేది మన లైఫ్‌లో ఒక భాగమైపోయింది. ఇదిలా ఉండగా.. స్మార్ట్‌ఫోన్ మన పనుల్ని ఎంతలా సులభతరం చేసిందో.. మరోవైపు అది అంతే ప్రమాదకరంగా మారుతోంది. ఎందుకంటే మీ ఫోనులో వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకింగ్ లావాదేవీల సమాచారం కూడా ఉంటుంది. అయితే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు సంబంధించి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో కీబోర్డ్ సౌండ్‌తో ఫోన్లో రికార్డ్ చేయబడిన బ్యాంకింగ్, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
మీరు స్మార్ట్‌ఫోన్ నుంచి బ్యాంకింగ్ చెల్లింపులు లేదా సోషల్ మీడియా యాప్‌లో లాగిన్ అవ్వడానికి, మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.. అయితే, దీని కోసం కొన్ని ప్రత్యేక రకాల కీబోర్డులు తయారు చేయబడుతున్నాయి. వీటి ద్వారా మీరు లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇస్తే వాటిని చాలా ఈజీగా గుర్తించొచ్చు. కీబోర్డ్ స్ట్రోక్ అందులో నమోదు చేయబడుతుంది.
సిటిజెన్ ల్యాబ్ తాజా నివేదికలో భద్రతా ప్రమాదాలు ఉన్న అనేక కీబోర్డ్ యాప్స్ గుర్తించబడ్డాయి. ఈ యాప్స్ కీ స్ట్రోక్స్ లీక్ చేయగలవని కూడా క్లెయిమ్ చేయబడింది. మరో ప్రమాదకరమైన విషయం ఏంటంటే.. ఈ కీబోర్డ్ యాప్స్ సామ్ సంగ్, షియోమీ వంటి స్మార్ట్ఫోన్లలో ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు ఏదైనా వస్తువులను తీసుకునేందుకు ఆన్లైన్ డెలివరీ, హోమ్ డెలివరీ లేదా ఫుడ్ డెలివరీ వంటి వాటి కోసం కొన్ని యాప్స్ వాడుతుంటాం. వీటిని వాడే సమయంలో కొన్ని సందర్భాల్లో పాస్ వర్డ్స్ అవసరం పడి నెట్ బ్యాంకింగ్ వాడటం వంటివి చేస్తుంటాం. ఆ సమయంలో మీరు కీబోర్డ్ యాప్స్ మీ డేటాను స్టోర్ చేస్తుంది. ఇవి లీకవ్వడమే కాదు.. దుర్వినియోగం అయ్యే అవకాశం కూడా ఉంది.
ఏంచేయాలి ?
* మీ కీబోర్డ్ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.
* మీరు అలాంటి కీబోర్డ్ యాప్స్ ఉపయోగించినప్పుడు, కీ స్ట్రోక్ డేటా డివైజ్‌లో స్టోర్ చేయబడుతుంది.
* వీలైతే, కీస్ట్రోక్ డేటాను స్టోర్ చేయని కీబోర్డ్ యాప్స్ ఉపయోగించాలని సిటిజన్ ల్యాబ్ ప్రజలకు సూచించింది.