‘ఓరేయ్ బంటి.. పిలిచింది పక్కింటి ఆంటీ..’ పరిగెత్తుకుంటూ వచ్చాడు బంటి.. ‘ ఆ చెప్పండి ఆంటి’ అన్నాడు బంటి. ఒకసారి పోలింగ్ బూత్‌కు వెళ్లి ఎంతమంది లైన్లో ఉన్నారో చూసి రారా ప్లీజ్ అని అడిగింది. ‘ఓకే’ అని రయ్రయ్ అని పరిగెత్తుకుంటూ వెళ్లి చూసి వచ్చాడు బంటి. ‘చాలా మంది ఉన్నారాంటి’ అని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత ఆంటి మళ్లీ పిలిచింది.. అలా పిలుస్తూనే ఉంది. బంటికి కోపం వచ్చింది. ఇంతలోనే ఇంటికి అంకూల్ వచ్చాడు. ఓటు వేశావా అని అడిగాడు. లేదు అని భార్య చెప్పింది. ఎందుకు అని అడిగితే లైన్లో ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు.. బంటిని చూడమంటే చూడడం లేదు అని బాధగా చెప్పింది. వెంటనే అంకూల్ జేబులో నుంచి నవ్వుతూ ఫోన్ తీశాడు. ఒక క్లిక్‌తో లైన్లో ఎంతమంది ఉన్నారో చెప్పేశాడు. ఆంటీ ఆశ్చర్యపోయింది. ఎలా తెలుసుకున్నారని ఆరా తీసింది. అసలు విషయం చెప్పాడు అంకూల్. దీంతో లైన్లో క్యూ తగ్గినప్పుడు తీరిగ్గా వెళ్లి ఓటు వేసి వచ్చింది ఆంటీ. మీరు కూడా ఇలానే హ్యాపీగా ఓటు వెయ్యాలని అనుకుంటే జీహెచ్ఎంసీ తన వెబ్సైట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లింక్ గురించి తెలుసుకోండి.
ఇలా తెలుసుకోండి:
తెలంగాణ ఎన్నికల(Telangana elections) పోలింగ్ కు టైమ్ దగ్గర పడింది. ఓటు వేసేందుకు యావత్ తెలంగాణ రెడీ అయ్యింది. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో, కొలిగ్స్‌తో లేదా ఒంటరిగానైనా ఓటు వేసేందుకు అంతా సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అంతా యాక్టివ్గానే ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం కాస్త బద్ధకంగా ఉంటారు. మరికొందరేమో లైన్లో తక్కువ మంది ఉన్నప్పుడు వెళ్లి ఓటు వెద్దామని అనుకుంటారు. ఇలాంటి వారికి ఇదే గుడ్‌న్యూస్. GHMC తన వెబ్‌పేజీలో ప్రత్యేకంగా ఓ లింక్‌ను క్రియేట్ చేసింది. మీరు సైట్ ఓపెన్ చేయగానే పైన స్క్రొలింగ్పై ఓ లుక్కేయండి. అక్కడ ‘Poll Day- check Voters Queue at PS’ అన్నదానిపై క్లిక్ చేయండి.
అక్కడ క్లిక్ చేయగానే మీకు పోల్ క్యూ రూట్ అని ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ నియోజకవర్గాన్ని, మీ పోలీంగ్ స్టేషన్‌ను ఎంపిక చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అది సెలక్ట్ చేసుకోండి. వెంటనే మీకు లైన్లో ఎంతమంది ఉన్నారు.. వెయిటింగ్ టైమ్ ఎంత అన్నది క్లియర్‌గా కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌తో పాటు మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్‌లోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
Also Read: మీరు తప్పకుండా ఓటేయాల్సిందే.. ఎందుకంటే?
WATCH: