Raajadhani Files Movie : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో పొలిటికల్ హీట్ పెరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పలు సినిమాలు రూపొందుతున్నాయి. ఈ వివాదాస్పద చిత్రాల్లో ఒకటైన ‘రాజధాని ఫైల్స్'(Raajadhani Files) అమరావతి(Amaravati) రాజధాని అంశంపై జరుగుతున్న పరిణామాల గురించి రూపొందించిన సినిమా. ఈ చిత్రం రాష్ట్రంలోని ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ(YCP) కి అనుకూలంగా లేకపోవడంతో నిన్న సినిమా విడుదలను నిలిపివేయాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. కానీ కాసేపటికే కోర్టు సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది.
ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి(Lella Appi Reddy) దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. నిన్న చాలా ఏరియాల్లో స్క్రీనింగ్స్ జరుగుతుండగానే సినిమా విడుదలను మధ్యలోనే నిలిపివేశారు.
అయితే ఎట్టకేలకు ఈ సినిమాను నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించేందుకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే సెన్సార్ బోర్డు(Sensor Board) సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించడం ద్వారా సమస్యలను పరిష్కరించిందని, ఆ తర్వాత రివ్యూ కమిటీ సర్టిఫికేట్ ను తిరిగి జారీ చేసిందని చిత్ర నిర్మాతల న్యాయ సలహాదారు వాదించారు. ఇప్పుడు తుది నిర్ణయం వెలువడింది మరి దీనిపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read : మరీ ఇంత క్రూరమా? కోట్లకు కోట్లు కట్నం తీని కూడా హింస పెట్టి చంపేశారు!