OG (Original Gangster) : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘ఓజీ ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) (OG) సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులయినా ఎలాంటి అప్డేట్ లేకపోవడానికి ఒకే ఒక్క కారణం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటమే అని అందరికి తలిసిందే. అయితే .. సుజిత్ కట్ చేసిన టీజర్ తో ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. ఈ ప్రాజెక్టు ఆలస్యం అవడంతో రకరకాల ఊహాగానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా మరీ ఇంతగా లేటవడంవల్ల నిర్మాత డివివి దానయ్యపై వడ్డీల భారం పడుతోందని .. ఆ రీజన్ వల్లనే ప్యూపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ఈ ‘ఓజీ’ మూవీని టేకోవర్ చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఓజీ మా సినిమా.. ఎప్పటికీ మాదే- దానయ్య
డివివి ఎంటర్టైన్మెంట్స్ అధినేత ఓజీ చిత్ర నిర్మాత డివివి దానయ్య ‘ఓజీ ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) (OG) మూవీపై వైరల్ అవుతోన్న ప్రచారాలపై స్పందించారు. ఓజీ పై వస్తోన్న ప్రచారాలను కొట్టిపడేశారు. ఈ మూవీ తమ సంస్థదేనని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు.”ఓజీ” మా సినిమా.. ఎప్పటికీ మాదే. ఈ సినిమా ఎలా ఉండబోతుందో మాకు స్పష్టత ఉంది. ఆ దిశగా ముందుకు సాగుతున్నాం. ఆకలితో ఉన్న చిరుత దేనిని వదిలిపెట్టదు’’ అని ట్వీట్ చేసింది.
ALSO READ:Guntur kaaram trailer:రౌడి రమణ సినిమా స్కోపు .. 70MM..మిర్చీ యార్డులో చెలరేగిపోయన మహేష్
సుజిత్ కు ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఓజీ
ఓ డిఫరెంట్ గ్యాంగ్స్టర్ స్టోరీతో ముంబయి, జపాన్ నేపథ్యంలో అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా పాన్ ఇండియా స్థాయిలో అలరించబోతోంది. సాహూ లాంటి పాన్ ఇండియా చిత్రం తరువాత సుజిత్ చేస్తోన్న ప్రాజెక్టు కావడంతో ఈ మూవీ చాలా ప్రెస్టీజియస్ గా తీర్చిదిద్దుతున్నాడు సుజిత్. నిర్మాత డి వివి దానయ్య కూడా ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంకా మోహన్ నటిస్తుండగా , ఇతర ముఖ్య పాత్రల్లో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్నటిస్తున్నారు.. సో.. ఈ రెండు నెలలు పవన్ కళ్యాణ్ లేని షూటింగ్ చేసి ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ తో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. సో.. ఓజి మూవీకి డివివి ధానయ్యనే నిర్మాత.
ALSO READ:గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ? ..మరి కాసేపట్లో ట్రైలర్ రిలీజ్