Pawan Kalyan Marriages: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు వివాహాల గురించి ఇటీవల వైసీపీ అధినేత జగన్ (CM Jagan) తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసింది. పవన్ కళ్యాణ్ ఇళ్లు మాత్రం హైదరాబాద్ లోనే ఉంది కానీ.. ఇల్లాలు మాత్రం ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి మారుతోందంటూ తీవ్ర వాఖ్యలు చేశారు జగన్. మొదటి భార్య లోకల్, రెండో భార్య నేషనల్, ఆ తర్వాత ఇంటర్ నేషనల్.. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెళ్లిళ్ల పై జగన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ వాఖ్యలపై రాజకీయ నాయకులతో పాటు నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. కొంత మంది జగన్ వాఖ్యలను సమర్ధిస్తుండగా.. మరికొందరు మాత్రం వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరికాదంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ముగ్గురు భార్యలు ఎవరు? వారు ఇప్పుడేం చేస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
పవన్ కళ్యాణ్ కు 1997లో నందిని అనే అమ్మాయితో కుటుంబ సభ్యులు వివాహం చేశారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల చేత వీళ్లిద్దరు 2007 లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తనతో పలు సినిమాల్లో నటించిన రేణు దేశాయ్ (Renu Desai) ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే వీళ్లిద్దరికీ అఖీరా, ఆద్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2012 లో రేణుదేశాయ్ తో విడాకులు తీసుకున్న పవన్ అన్నా లెజ్నెవా (Anna Lezhneva)ను మూడో వివాహం చేసుకున్నారు. 2011లో ‘తీన్మార్’ షూటింగ్ సమయంలో కలిసిన వీళ్ళు 2013 లో సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో ఉన్నట్లు సమాచారం. మొదటి భార్య పవన్ తో విడాకులు అయ్యాక మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఇక రెండో భార్య రేణుదేశాయ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్ తను చేసుకున్న మూడు పెళ్ళిళ్ళు అనుకోకుండా కొన్ని కారణాల రిత్యా అలా జరిగిపోయాయని పవన్ కళ్యాణ్ ఇదివరకే క్లారిటీ ఇచ్చినప్పటికీ, మళ్ళీ ఆయన వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లో మాట్లాడి ఆయన పై విమర్శలు చేయడం సరి కాదని జనసేన (Janasena) నేతలు ఆరోపించారు.
Also Read: కోటిన్నర విలువ చేసే దిల్ రాజు అల్లుడి పోర్షే కారు చోరీ..!