పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్ క్రీడలు రసవత్తర దశకు చేరుకున్నాయి. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు ఒలింపిక్ గ్రామాలలో ఉంటారు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా అక్కడ ఉన్న ఉష్ణోగ్రతలు విపరీతమైన వేడి కారణంగా తీవ్రంగా మారాయి. తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆటగాళ్ల నుంచి డిమాండ్లు కూడా వచ్చాయి.
ఒలింపిక్ సంఘం, ఫ్రాన్స్ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అథ్లెట్ల సౌకర్యార్థం కొత్త ఏర్పాట్లు చేసింది. దీని ప్రకారం ఆటగాళ్లకు 40 ఏసీలు పంపాలని నిర్ణయించారు. ఒలింపిక్ విలేజ్లలో భారత అథ్లెట్లు బస చేసే గదుల్లో ఈ ఏసీలను ఏర్పాటు చేయనున్నారు.