NTR: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో క్వాలిటీ సమయాన్ని గడుపుతున్నారు. ఇటీవలే తన అమ్మ షాలిని కోరిక మేరకు ఆమె పుట్టినరోజు కానుకగా ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్న తారక్.. అనంతరం అక్కడి ప్రముఖ దేవాలయాలన్నీ సందర్శించారు. తారక్ తో పాటు కన్నడ హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా జాయిన్ అయ్యారు. వారిద్దరూ స్వయంగా దగ్గరుండి ఎన్టీఆర్ కు కర్ణాటకలోని అన్ని దేవాలయాలను చూపించారు.
ఎన్టీఆర్ హిల్ స్టేషన్ లో వెకేషన్
అయితే తాజాగా తారక్, రిషబ్, ప్రశాంత్ తమ ఫ్యామిలీస్ తో కలిసి హిల్ స్టేషన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. మంగళూర్ లోని ఓ హిల్ స్టేషన్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రశాంతమైన సమయాన్ని గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్, తన భార్య ప్రణతీ, తల్లి షాలిని తో పాటు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్.. వారి భార్యలు ఉన్నారు.
More beautiful pictures of #NTR, #PrashanthNeel & #RishabShetty with their families. #ManOfMassesNTR pic.twitter.com/cU8PjltuSj
— Telugu Cineverse (@TeluguCineverse) September 6, 2024
Also Read: This Week OTT Movies: ఈ వారం ఓటీటీ సినిమాల సందడి..! స్ట్రీమింగ్ వివరాలివే – Rtvlive.com