Ayodya Rama Mandir :అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రేపు అంటే జనవరి 22న జరగబోయే ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు దేశం, ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు రానున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకారం, ప్రతిష్ఠాపన తర్వాత రామ మందిరం సాధారణ ప్రజల కోసం తెరవబడుతుంది. రామమందిరంలో సామాన్యులు ఎప్పుడు దర్శనం చేసుకోగలరు? ఫీజు చెల్లించాల్సి ఉంటుందా లేదా? హారతి సమయం ఇత్యాది విషయాలగురించి తెలుసుకుందాం.
జనవరి 23 నుంచి సామాన్య భక్తులు రాంలల్లా దర్శనం
ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు జనవరి 23 నుంచి సామాన్య భక్తులు రాంలల్లా దర్శనం చేసుకోగలుగుతారు. జనవరి 22న సామాన్య భక్తుల దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు లేవు. మరుసటి రోజు నుండి సామాన్య భక్తుల దర్శనార్ధం తలుపులు తెరవబడతాయి. ఈ విధంగా సామాన్య ప్రజలు రామ్జీ దర్శనం చాలా సులభంగా పొందగలుగుతారు. ఈ కాలంలో, ఒకటి లేదా రెండు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఆలయ ప్రవేశ సమయం
ఉదయం 7:00 నుండి 11:30 వరకు ,తిరిగి మధ్యాహ్నం 2:00 నుండి రాత్రి 7:00 గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. స్వామివారి ఆరాధన మరియు విశ్రాంతి కోసం ఆలయ తలుపులు మధ్యాహ్నం రెండున్నర గంటల పాటు మూసివేయబడతాయి.
హారతి సమయం
రాంలల్లా యొక్క హారతి రోజుకు మూడు సార్లు నిర్వహిస్తారు.
మొదటి జాగ్రన్ లేదా శృంగార్ హారతి – ఉదయం 6:30,
రెండవ భోగ్ హారతి – మధ్యాహ్నం 12:00,
మూడవ సాయంత్రం హారతి – రాత్రి 7:30
హారతిలో ఒకేసారి 30 మంది మాత్రమే
భగవంతుని హారతిలో పాల్గొనడానికి, మీరు శ్రీ రామ మందిర్ తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుండి అందుబాటులో ఉండే పాస్ తీసుకోవచ్చు. ఈ పాస్ పొందేందుకు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (ID ప్రూఫ్) చాలా ముఖ్యం. హారతిలో ఒకేసారి 30 మంది మాత్రమే పాల్గొనగలరు. అయోధ్యలోని రామ మందిరంలో భక్తులు రాం లల్లాను ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ALSO READ:11 రోజులపాటు మోడీ చేస్తున్న అనుస్టానంలో కొబ్బరి నీళ్ళు మాత్రమే ఎందుకు తాగుతారు?