Hero Nikhil Blessed With a Baby Boy: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రయ్యారు. నిఖిల్, పల్లవి దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్నీ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. “నిఖిల్, పల్లవి దంపతులకు బేబీ బాయ్ పుట్టాడు . వారి కుటుంబంలోకి మరో సంతోషకరమైన చేరిక పై.. హృదయపూర్వక అభినందనలు” అంటూ నిఖిల్ తమ బాబును చేతిలో పట్టుకున్న బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నిఖిల్ అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిఖిల్ 2020 లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి వివాహం చేసుకున్నారు. కోవిడ్ కారణంగా వీరి పెళ్లి సింపుల్ గా అయిపోయింది. 2024 ఈ దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు.
Also Read: ‘శీలావతిగా’.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో రిపీట్
. @actor_Nikhil and his wife Pallavi are now blessed with a BABY BOY❤️
Warmest congratulations to the glowing couple on this delightful addition to their family 🤗✨ pic.twitter.com/sLhOeu87ss
— Ramesh Bala (@rameshlaus) February 21, 2024
ఇక హీరో నిఖిల్ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న నిఖిల్.. ఆ తర్వాత ఎన్నో మంచి అవకాశాలను అందుకున్నారు. రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిఖిల్.. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్నారు.
Also Read: Virushka: రెండో బిడ్డకు జన్మనిచ్చిన విరాట్-అనుష్క దంపతులు.. పేరు ఏంటో తెలుసా?