Life Style: శారీరకంగా ఫిట్ గా ఉండడానికి ప్రతీరోజు జిమ్, యోగా వంటి వ్యాయామాలు చేస్తారు. నేటి బిజీ లైఫ్ లో కొంత మంది మార్నింగ్ వర్కౌట్స్ చేయడానికి టైమ్ దొరకకపోవడంతో నైట్ టైం జిమ్ కు వెళ్తుంటారు. అయితే రాత్రి పూట జిమ్ చేయడం ఆరోగ్యానికి మంచిదేనా..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం నైట్ జిమ్ చేయడం ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. రాత్రి పూట జిమ్ చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
శరీర నొప్పులు
రాత్రిపూట జిమ్లో తీవ్రమైన వ్యాయామాల వల్ల వ్యక్తుల నాడీ వ్యవస్థ చాలా ఉత్తేజితమవుతుంది. ఇది సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. దీని కారణంగా నిద్ర ప్రతికూలంగా ప్రభావితం కావడమే కాకుండా, కండరాలు, శరీర నొప్పి సమస్యలను కలిగిస్తుంది.
నిద్రకు భంగం
అర్థరాత్రి సమయంలో జిమ్ చేయడం వల్ల శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి.
జీర్ణ సమస్యలు
రాత్రిపూట వ్యాయామం జీర్ణవ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
హార్మోన్ల అసమతుల్యత
నైట్ జిమ్ వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. నిద్రను ప్రభావితం చేసి.. మానసిక కల్లోలం, హార్మోన్ల అసమతుల్యతల సమస్యలకు దారి తీస్తుంది.
మానసిక ఒత్తిడి
అర్థరాత్రి వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read:Health: ఈ కూరగాయలను తక్కువగా ఉడికించండి.. లేదంటే పోషకాలు నశిస్తాయి..! – Rtvlive.com