Nayanathara News: సూపర్ స్టార్ గా హీరోలు దశాబ్దాల తరబడి ఉండడం మనకు తెలుసు. కానీ, హీరోయిన్స్ అలా ఎక్కువ కాలం ఉండలేరు.. ఉండరు కూడా.. అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో పదేళ్లు హీరోయిన్ గా ఉండడమే గొప్ప విషయం అలాంటిది దాదాపుగా రెండు దశాబ్దాలుగా (ఆమె మొదటి సినిమా 2004లో తమిళంలో అయ్యా.. 2006 తెలుగులో లక్ష్మీ) హీరోయిన్ గా ఉండడమే కాదు.. టాప్ హీరోయిన్ గా.. లేడీ సూపర్ స్టార్ గా వెలుగుతోంది నయనతార. సినిమా ఇండస్ట్రీ అంటేనే వివాదాలు.. అందులోనూ హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివాదాలు ఎన్ని వచ్చినా.. తనపై ఎన్నిరకాలుగా పుకార్లు షికార్లు చేసినా.. తనను ఎంత ట్రోల్ చేసినా.. అసలు ఎవరు ఏమనుకున్నా.. రెస్పాండ్ కాదు. సోషల్ మీడియాలో కూడా ఆమె ఎక్కువగా కనిపించదు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సినిమాకు సైన్ చేశామా.. షూటింగ్ లో పాల్గొన్నామా? ఇంటికి వెళ్లిపోయామా? ఇంతే.. సినిమా షూటింగ్ పూర్తి అయ్యాకా.. ఒక పాట్ రిలీజ్.. టీజర్ రిలీజ్ అంతెందుకు.. సినిమా విడుదల అయ్యాకా సక్సెస్ మీట్ కి కూడా ఆమె(Nayanathara News) రాదు. షూటింగు అయిపోయిన వెంటనే ఆ సినిమా తో సంబంధమేమీ ఉంచుకోదు. ఎక్కడా ప్రెస్ మీట్.. లేదా ఒక ఫోటో షూట్ చేసిన పరిస్థితి కూడా ఉండదు. అసలు నయనతార అంత ప్రొఫెషనల్ నటి దేశంలో కాదు ప్రపంచంలోనే ఉండదని చెప్పడం ఎక్కువగా చెప్పడం కాదు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? నాయన తార గురించి ఇంత చెప్పకపోతే.. తరువాత ఆమె చేసిన పని చెప్పినా మీకు సరిగా అర్ధం కాదు. అందుకే ఇదంతా.. సరే అసలు విషయానికి వచ్చేద్దాం..
Also Read: కాంగ్రెస్ పాలనలో మీకు దక్కేవి ఇవే..నటి మాధవీలత వైరల్ పోస్ట్
ఇటీవల నయనతార(Nayanathara News) తన 75వ సినిమాలో నటించింది. అది తమిళ సినిమా. పేరు అన్నపూరణి .. ఈ సినిమా రీసెంట్ గా అంటే, డిసెంబర్ 1వ తేదీన విడుదలైంది. ఇక్కడ ఇది కూడా పెద్ద వార్త కాదు. కానీ ఆశ్చర్యకరంగా ఈ సినిమా కోసం ఒక ప్రమోషన్ లో నయనతార తళుక్కుమంది. అసలు కనీసం సినిమా చేసిన తరువాత దాని గురించి కూడా పట్టించుకోని నయనతార.. పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కూడా ప్రమోషన్స్ కి నో చెప్పి తప్పించుకున్న నయన.. ఇలా ఒక సినిమా ప్రమోషన్ కి వచ్చింది అంటే అది పెద్ద వార్తే కదా. అందుకే మీకోసం ఇదంతా చెప్పింది. ఇక అన్నపూరణి సినిమాలో నయనతార భారతదేశపు టాప్ చెఫ్ కావాలని కలలుకంటున్న ఒక సనాతన బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో నటించింది. ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కథను వివరించే హత్తుకునే కుటుంబ చిత్రం. ఈ చిత్రం క్లాసిక్ అండర్ డాగ్ కథ. విమర్శకుల అభిప్రాయం ప్రకారం, లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో నటించింది. అందుకే ఆమె ఒక అనాధ శరణాలయంలో పిల్లలకు బిర్యానీ వడ్డిస్తూ సినిమా ప్రమోషన్ చేసింది. ఇది ఇప్పుడు తమిళనాట సంచలన వార్తగా మారిపోయింది.
Briyani is even more special when Poorni serves it 🙂 #Annapoorani serving now in cinemas near you.
Enjoy the feast ❤️ pic.twitter.com/pf66rJCymI
— Zee Studios South (@zeestudiossouth) December 3, 2023
అన్నపూరణి సినిమా మీద వివాదాలు కూడా నడుస్తున్నాయి. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా నయనతార(Nayanathara News) నటించిన కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఒక వర్గం వారు సినిమా మీద విరుచుకు పడుతున్నారు. అన్నట్టు ఈ సినిమాలో రాజారాణి సినిమా హీరో జై హీరోగా నటించాడు. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు.
Watch this interesting Video: