Natasa Stankovic: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడిపోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు రాగా… తాజాగా జులై 18న తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 4’నాలుగేళ్ల పాటు కలిసి జీవించిన తర్వాత, నటాషా, తానూ పరస్పరం అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
నటాషా ఇన్స్టా స్టోరీ
అయితే విడాకులు ప్రకటించిన తర్వాత అదే రోజు నటాషా తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నటాషా తన ఇన్స్టా స్టోరీలో హార్దిక్ సోదరుడి కొడుకు ఫోటోను పంచుకుంది. జులై 18న కృనాల్ పాండ్య పెద్ద కుమారుడు కబీర్ పుట్టినరోజు సందర్భంగా.. కబీర్ తన ఒడిలో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. బర్త్ డే విషెష్ తెలియజేసింది. “హ్యాపీ బర్త్డే మై కవ్వూలీ బావులీ. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. ప్రేమతో మీ టియా (ఆంటీ )” అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నటాషా హార్దిక్ కు దూరమైనప్పటికీ హార్దిక్ కుటుంబ సభ్యులతో ఆమెకు ఉన్న సాన్నిహిత్యం ఇప్పటికీ అలాగే ఉందని ఈ పోస్ట్ ద్వారా తెలుస్తోంది.
నటాషా, హార్దిక్ మొదటి సారి నైట్ క్లబ్ లో కలిశారు. తొలి చూపులోనే నటాషాతో హార్దిక్ ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత 2020 సంవత్సరంలో నిశ్చితార్థం చేసుకున్నారు. మే 31న 2020న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని… ఆ తర్వాత మళ్ళీ 2023 లో అందరి సమక్షంలో ఈ జంట గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా అగస్త్య అనే కుమారుడు ఉన్నాడు.
Also Read: ROBINHOOD: ఏజెంట్ పాత్రలో రాజేంద్రప్రసాద్.. వైరలవుతున్న లుక్ – Rtvlive.com