Gita Worker Committed To Kill Himself : సూర్యాపేట జిల్లా (Suryapet District) లో తాటి చెట్టు పై ఉరేసుకొని ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. మునగాల మండలం ముకుందాపురంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముకుందాపురానికి చెందిన దేశగాని వెంకటేశం(75) రోజులాగే పనిలో భాగంగా కల్లు తీయడానికి శుక్రవారం ఉదయం గ్రామ శివారుకి వెళ్లారు.
ఈ క్రమంలోనే తాటి చెట్టు ఎక్కి ఉరేసుకున్నారు. గమనించిన గ్రామస్థులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
విషాదం వెంట మరో ప్రమాదం
మృతదేహాన్ని దించుతుండగా అనుకోని ఘటన
సూర్యాపేట – మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దేశగాని వెంకటేశం(80) తాటి చెట్టుకు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతదేహాన్ని కిందికి దింపేందుగు తాటి చెట్టు ఎక్కుతున్న వ్యక్తిపై మృతుడు పడటంతో అతనికి తీవ్ర… pic.twitter.com/zfrfi9N79O
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2024
ఇదిలా ఉంటే మృతదేహన్ని కిందకు దించే క్రమంలో అదే గ్రామానికి చెందిన నాగార్జున పై మృతదేహం పడటంతో ఆయన కింద పడిపోయారు. నాగార్జునకు గాయాలు కావడంతో కోదాడలోని ప్రైవేటు ఆసుపత్రి (Kodad Private Hospital) కి తరలించారు. తన భార్య మానసిక పరిస్థితి బాగోలేక పోవడంతో పాటు ఆర్థిక, కుటుంబ, అనారోగ్య సమస్యలతోనే వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువు దేశగాని నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.