Namrata Birth Day: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్న ఖచ్చితంగా ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తారు. గ్యాప్ దొరికినప్పుడల్లా పిల్లలు, ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తారు సూపర్ స్టార్. ఫ్యామిలీకి సంబంధించిన ప్రతీది స్పెషల్ గా భావించే మహేష్ బాబు.. నేడు వైఫ్ నమ్రత బర్త్ డే సందర్భంగా తన సోషల్ మీడియా వేదిక బ్యూటిఫుల్ విషెస్ తెలియజేశారు.
మహేష్ బాబు విషెస్
మహేష్ బాబు వైఫ్ నమ్రత 53వ వసంతంలోకి అడుగుపెట్టారు. ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు స్పెషల్ విషెస్ తెలియజేస్తూ ఇలా రాసుకొచ్చారు. “పుట్టిన రోజు శుభాకాంక్షలు NSG అంటూ హార్ట్ సింబల్స్ జోడించారు. నా జీవితంలో ప్రతీ రోజును అద్భుతంగా చేసినందుకు కృతజ్ఞతలు.. ఈ ఏడాది మరింత సంతోషం, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను ” అంటూ మహేష్ బాబు విషెస్ తెలిపారు. మహేష్ బాబు ట్వీట్ చూసిన అభిమానులు కూడా నమ్రతకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Mega Heroes: ఆ మూడు నెలలు మెగా ఫ్యాన్స్ కు పండగే.. వరుసగా మెగా సినిమాల సందడి
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం పై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వినిపించింది. ఈ సినిమాలో మహేష్ డాన్స్, ఫైట్స్, మాస్ యాక్షన్ తో అభిమానులను ఫిదా చేశారు. ముఖ్యంగా సినిమాలోని కొన్ని పాటలకు మాస్ స్టెప్పులతో దుమ్ములేపారు.
Happy birthday NSG…♥️♥️♥️
Grateful for another year filled with love and togetherness. Thank you for making my every day better 😍😍😍 Have a rocking 2024!! pic.twitter.com/uy6gK8AiWs— Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2024
Also Read: Guntur Kaaram: ఓటీటీలో గుంటూరు కారం ఘాటు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!