Mahesh Babu Review On Jawan Movie: బాలీవుడ్ బాద్ షా నటించిన జవాన్ (Jawan Movie) చిత్రం పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తుంది. గత చిత్రం పఠాన్ (Pathaan) సినిమాకంటే మించి భారీ వసూళ్లను రాబడుతుందని ఇప్పటికే అభిమానుల టాక్. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో (Director Atlee) ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో నయనతార (Nayanthara) హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ గా నటించారు. ప్రియమణి, దీపికా పడుకొణే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 7 న గ్రాండ్ రిలీజ్ అయిన జవాన్ పై భారీ అంచనాలున్నాయి. సినిమా విడుదలకు ముందే 3.9 లక్షల టికెట్లను అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నారు. గురువారం కూడా సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా పై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
సినిమా విడుదల కాకముందే షారూక్ సినిమాని కుటుంబ సమేతంగా చూడాలనుకుంటున్నట్లు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తెలిపారు. దానికి ప్రతిగా షారూక్ కూడా మీ కుటుంబంతో కలిసి నేను కూడా సినిమా చూడాలనుకుంటున్నని బదులు కూడా ఇచ్చారు. అయితే తాజాగా మహేష్ జవాన్ సినిమా పై రివ్యూ ఇచ్చారు.
మహేష్ సినిమా చూసి బ్లాక్ బస్టర్ సినిమా జవాన్ అంటూ కితాబు ఇచ్చాడు. కింగ్ తో అట్లీ కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ కెరీర్ బెస్ట్ ఫిలిం ఇది. షారుఖ్ ఆరా, స్క్రీన్ ప్రెజెన్స్ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. షారుఖ్ మంచి ఫైర్ మీద ఉన్నాడు. జవాన్ సినిమా షారుఖ్ సొంత సినిమా రికార్డులనే బద్దలు కొడుతుంది. లెజెండ్ అని పొగుడుతూ పోస్ట్ చేశాడు.
దీంతో మహేష్ నే స్వయంగా జవాన్ సినిమా గురించి ఓ రేంజ్ లో పోస్ట్ చేయడంతో దానిని అటు షారూక్ అభిమానులు, ఇటు మహేష్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.
#Jawan… Blockbuster cinema… 💥💥💥 @Atlee_dir delivers king size entertainment with the King himself!! Comes up with his career's best film… 👏👏👏 The aura, charisma and screen presence of @iamsrk are unmatched… He’s on fire here 🔥🔥🔥!! Jawan will break his own records……
— Mahesh Babu (@urstrulyMahesh) September 8, 2023
Also Read: బాక్సాఫీస్ బాద్షాగా రికార్డు సృష్టించిన షారుఖ్ ఖాన్