Mahesh Babu: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ ‘రాయన్’. జులై 26న విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ధనుష్ నటన, సినిమాను తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
#Raayan…. Stellar act by @dhanushkraja… brilliantly directed and performed. 🔥🔥🔥 Outstanding performances by @iam_SJSuryah, @prakashraaj, @sundeepkishan, and the entire cast. An electrifying score by the maestro @arrahman. 🔥🔥🔥 A must-watch…
Congratulations to the entire…
— Mahesh Babu (@urstrulyMahesh) July 29, 2024
రాయన్ టీమ్ కు మహేష్ బాబు అభినందనలు
అయితే తాజాగా ధనుష్ రాయన్ టాలీవుడ్ మహేష్ బాబు కూడా ప్రశంసలు కురిపించారు. సినిమాను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. “ధనుష్ అద్భుతంగా నటించడంతో పాటు బ్రిలియంట్‌గా డైరెక్ట్ చేశారు. ఎస్. జే సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్, ఎంటైర్ టీమ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. రెహమాన్ ఎలక్ట్రిఫైయింగ్ స్కోర్ సినిమాకు బాగా కలిసొచ్చింది. అందరూ చూడాల్సిన సినిమా ఇది. చిత్రబృందానికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ” దీని పై హీరో ధనుష్ కూడా స్పందించారు. మీ ప్రశంసలతో ‘రాయన్’ టీమ్ ఆశ్చర్యానికి లోనైంది. మీ ఆత్మీయతకు ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చారు. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 75 కోట్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం.
Thank you @urstrulyMahesh gaaru. It takes a heart. My team is thrilled. https://t.co/ckmt1G2Ihf
— Dhanush (@dhanushkraja) July 29, 2024
Also Read: Maruthi Nagar Subramanyam: ఫుల్ ఫన్.. రావు రమేష్ ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ట్రైలర్’ – Rtvlive.com
‘