Mahesh Babu Nephew: సూపర్ స్టార్ మహేష్ బాబు అనగానే అభిమానులకు మొదటగా గుర్తొచ్చేది ఆయన స్టైల్, యాటిట్యూడ్, స్వాగ్ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా మహేష్ స్టైల్ ను ఎవరు బీట్ చేయలేరనే చెప్పాలి. మహేష్ బాబు ప్రత్యేకమైన యాటిట్యూడ్, స్టైల్ ఎవ్వరు ఇమిటేట్ చేయలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇటీవలే జరిగిన ఒక మూవీ ఈవెంట్ లో మహేష్ బాబు మేనల్లుడు చరిత్ మానస్.. అచ్చం మహేష్ బాబు పోలికలతో జిరాక్స్ కాపీలా కనిపించి అందరిని ఆశ్చర్యపడేలా చేశాడు.
Also Read: Raashi khanna: ఎంత ముద్దుగా ఉందో.. మేకప్ లేని రాశిఖన్నాను చూస్తే ఫ్లాట్ అవుతారు
చరిత్ మానస్ మహేష్ బాబు అక్క ప్రియదర్శి, హీరో సుదీర్ బాబు దంపతుల కుమారుడు. ఈవెంట్ లో మహేష్ బాబు మేనల్లుడు చరిత్ మానస్ వాకింగ్ స్టైల్, యాటిట్యూడ్ చూసిన వాళ్లంతా అచ్చం మేనమామ పోలీకలు.. వాకింగ్ స్టైల్ సేమ్ టూ సేమ్ దింపేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆ మధ్య కాలంలో నెట్టింట్లో తెగ వైరలైంది. ఇది చూసిన మహేష్ బాబు ఫ్యాన్స్ జూనియర్ మహేష్, జిరాక్స్ కాపీలా ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. చరిత్ మానస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. హీరో సుదీర్ బాబు కూడా చరిత్ ను హీరోను చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు వినిపిస్తోంది. ఒక వేళ ఇది నిజమైతే జూనియర్ మహేష్ రావడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు.
#MaheshBabu మేనల్లుడు, #SudheerBabu తనయుడు #CharithManas కి జన్మదిన శుభాకాంక్షలు 💐
ఈ మధ్య ఓ ఈవెంట్ లో అచ్చుగుద్దినట్టు మేన మావయ్య లానే కనిపించాడు చరిత్. pic.twitter.com/g6j4FIBxrw
— Rajesh Manne (@rajeshmanne1) November 22, 2023
Also Read: Pushpa 2: పుష్ప 2 స్టోరీ లీక్ చేసిన దేవి శ్రీ ప్రసాద్.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్!