Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవర్ గ్రీన్ హ్యాండ్ సమ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు జిమ్ లో బాడీ బిల్డ్ చేస్తున్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా, ఆ ఫోటో చూసిన అభిమానులు ఫైర్ ఇమేజీస్, స్పీచ్ లెస్, సూపర్ ఫిజిక్ అంటూ పలు కామెంట్లతో స్పందిస్తున్నారు. మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఫైర్ ఇమోజీ పెట్టి స్పీచ్ లెస్ అంటూ మహేష్ బాబు ఫోటో పై స్పందించారు.
మహేష్ బాబు తన సోషల్ మీడియా వేదిక పై పోస్ట్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్లు ‘బీస్ట్ మోడ్’, ‘ప్రపంచ సినిమా మీలోని బీస్ట్ ను చూడబోతుంది’ అంటూ నెటిజన్లు చాలా ఆసక్తిగా కామెంట్ చేశారు. ఈ ఫోటోను పోస్ట్ చేసిన గంటలోనే 2,00,000 లైక్స్ రాగా కొన్ని వేలల్లో కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్ బాబును చాలా ఇంటర్వ్యూస్ లో మీ ఫిట్ నెస్ కు కారణమేంటి అని అడగగా.. తను తీసుకునే ఆహరం విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని, జిమ్ లో శారీరక వ్యాయామంతో పాటు తాను తీసుకునే ఆహరం విషయంలో చాలా పద్దతిగా ఉంటాను ఇదే నా ఫిటినెస్ రహస్యమని చెప్పారు.
జిమ్ లో వర్క్ ఔట్ చేస్తూ పోస్ట్ చేసిన ఈ ఫోటోను చూసిన నెటిజన్లు మహేష్ నెక్స్ట్ రాజమౌళితో చేయబోయే సినిమా కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి ప్రతి సినిమాల్లో పాత్ర తగట్టు హీరో ఉండాలని అనుకుంటాడు. బాహుబలి టైంలో ప్రభాస్, రానా సినిమా కోసం చాలా కష్టపడి బాడీ బిల్డ్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు మహేష్ కూడా రాజమౌళి సినిమాకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.
Also Read: Prabhas: ప్రభాస్ తీరుపై శ్యామలాదేవి ఆవేదన..ప్రభాస్ చివరి కోరిక తీర్చలేదంటూ..