Maha Shivarathri 2024: మహా శివరాత్రి వేడుకలు తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హర హర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పర్యాటక శైవ క్షేత్రం భైరవకోనకు భక్తులు పొటెత్తుతున్నారు. శ్రీ భైరవేశ్వర స్వామి ఆలయం వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది.
Also Read: హనుమకొండ జిల్లాలో దారుణం.. విద్యార్థిని సూసైడ్
ఏపీలోని చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రకృతి రమణీయమైన అందాలతో అలరాడే భైరవకోన క్షేత్రంలోని జలపాతంలో స్నానమాచరిస్తున్నారు. శ్రీ భైరవేశ్వర స్వామి, త్రిముఖ దుర్గాంబా దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భైరవకోనలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. తొక్కిసలాటకు గురికాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లను చేశారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భారీగా తరలివచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Also Read: రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్లేటప్పుడు ఈ కలర్ డ్రెస్ లు వేసుకుంటే డేంజర్..!
ఈ భైరవకోనకు క్షేత్రపాలకుడు భైరవుడు కావటంతో ఈ క్షేత్రానికి భైరవకోన అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అష్టదిక్యాలకు కాపాలాగా ఉంటాడని.. అందుకనే కాకులు కూడా తిరగవని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ భైరవకోనలో శని ప్రభావం అనేది ఏ మాత్రం ఉండదట. ఒకే రాతిలో అష్ట శివ గృహాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. అందుకే తమ శనిని వదిలించుకునేందుకు భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివస్తారని స్థానికులు చెబుతున్నారు.