Empire State Buidling: అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న మాన్ హట్టన్ ప్రాంత ప్రజలను బుధవారం రాత్రి పిడుగులు హడలెత్తించాయి. అలాగే ఈ సిటీలోని రెండు ప్రముఖ స్కైటవర్స్ మీద పిడుగులు పడ్డాయి.ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చిటారున ఉన్న పొడవాటి యాంటెనాను భారీ పిడుగు తాకిన ఫొటోను ఆ బిల్డింగ్ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఆ బిల్డింగ్ ప్రతినిధులు పోస్ట్ చేశారు.
ఫొటో షేర్ చేయడమే కాకుండా దాని పక్కన అయ్యో అంటూ ఓ క్యాప్షన్ ను కూడా జత చేశారు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వెబ్ సైట్ ప్రకారం ఆ భవనంపై ఉన్న యాంటెనాను ప్రతి ఏడాది సగటున 25 సార్లు పిడుగులు తాకుతుంటాయి. ఇదిలా ఉంటే మరో ప్రఖ్యాత కట్టడమైన వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైనా పిడుగు పడింది. భవనం పైభాగాన ఏర్పాటు చేసిన యాంటెనాను పిడుగు తాకిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
OUCH
📷: @GaryHershorn pic.twitter.com/2u6nHcEVhD
— Empire State Building (@EmpireStateBldg) May 30, 2024
వాటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ‘అదిరింది’ అంటూ ఒకరు కామెంట్ పెట్టగా మరొకరేమో ‘అందులో ఉన్న మీరంతా క్షేమమేనా’ అంటూ పోస్ట్ పెట్టారు.
Also read: మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్.. ఈసారైనా బెయిల్ వచ్చేనా?