Varun,Lavanya Marriage: మెగా కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.. వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇటలీలోని టుస్కానీలో జరగనున్న వరుణ్, లావణ్య పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు ఇటలీ చేరుకున్నారు. ఇక వరుణ్, లావణ్య పెళ్లి కోసం వారం క్రితమే రామ్ చరణ్, ఉపాసన తన కూతురుతో ఇటలీ బయలుదేరారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కలిసి పెళ్లి వేడుకలకు ఇటలీ చేరుకున్నారు.
పెళ్లి వేడుకల కోసం ఇటలీ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడ హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబందించిన ఫొటోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ వేదిక పై షేర్ చేశారు. “కొణిదెల, కామినేని హాలీడే ఇన్ టుస్కానీ” అంటూ ఫ్యామిలీతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో రాంచరమ్, ఉపాసన ఇద్దరి ఫ్యామిలీస్ చాలా ఆనందంగా కనిపించారు. ఈ ఫొటోలో చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుష్మిత వారి పిల్లలతో కనిపించారు. అలాగే ఉపాసన సిస్టర్, బ్రదర్, అమ్మ, నాన్న కూడా ఉన్నారు.
నవంబర్ 1 న వరుణ్, లావణ్య వివాహం జరగనుంది. ఈ పెళ్లి వేడుకల్లో మెగా , అల్లు ఫ్యామిలీస్ సందడి చేయనున్నారు. గతంలో జరిగిన నిహారిక పెళ్లి కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు వరుణ్ పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటలీలో పెళ్లి పూర్తయ్యాక.. హైదరాబాద్ లో గ్రాండ్ గా రెసెప్షన్ ప్లాన్ చేయనున్నారు. ఈ రెసెప్షన్ కు ఇండస్ట్రీలోని ప్రముఖులు, సన్నిహితులు హాజరు కానున్నారు.