కూకట్ పల్లిలో జనసేన జెండ ఎగరడం ఖాయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ కుమార్. తెలంగాణ గడ్డపై జనసేన జెండా ఎగరవేసి తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. 30ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నానని..అందరివాడినని..ప్రజల్లో కలిసి మెలిసి తిరుగుతున్నాని చెప్పారు. కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని తన గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్నారు. పవన్ కల్యాణ్ మరో రెండు రోజుల్లో కూకట్ పల్లిలో ప్రచారానికి వస్తున్నట్లు ప్రేమ్ కుమార్ తెలిపారు. ఆర్టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.
ఇది కూడా చదవండి: డిగ్రీ అర్హతతో… ఈ ప్రభుత్వ సంస్థలో భారీ రిక్రూట్మెంట్..వెంటనే అప్లయ్ చేసుకోండి..!!