KTR Statement On Telangana Elections: తెలంగాణలో మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఈ విషయం తాను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారంపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. తాను అలా అనలేదని క్లారిటీ ఇచ్చారు. ‘తెలంగాణ ఎన్నికలు మేలో జరగవచ్చు అంటూ.. తెలంగాణ ఎన్నికలపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే.తారకరామారావు చేసిన కామెంట్స్ గా కొన్ని మీడియా ఛానళ్లు స్క్రోలింగ్స్ ప్రచారం చేస్తున్నాయి. అలాంటి ప్రస్తావన ఏమాత్రం రాలేదు. దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా.’ అంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌లో జరుగబోవని, ఏప్రిల్ గానీ, మే నెలలో జరిగే అవకాశం ఉందంటూ మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్‌లో అన్నట్లుగా వార్తలు ప్రసారం అవుతున్నాయి. ‘అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయి. కానీ, అక్టోబర్‌లో నోటిఫికేషన్ రావడం అనుమానమే. తెలంగాణలో ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరగొచ్చు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో ప్రతిపక్షాల తాపత్రయం అంతా రెండో స్థానం కోసమే. అభ్యర్థుల ప్రకటన తర్వాత తమకు మరింత సానుకూల వాతావరణం ఏర్పడింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాష్ట్రంలో 90 స్థానాలకు పైగా గెలుస్తాం.’ అంటూ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లుగా మీడియాలో ప్రసారం అవుతోంది. ఈ వార్తపై తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. తాను అలా అనలేదని స్పష్టం చేశారు.
Also Read:
Breaking: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రేపు ఢిల్లీకి జగన్..!
PV Ramesh: మేఘా ఇంజినీరింగ్ సంస్థకు పీవీ రమేశ్ రాజీనామా.. బలవంతంగా పంపించారా?