సోలోగా వచ్చి సిక్స్ ఇయర్స్
DEVARA FIRST GLIMPS : యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటెర్టైనర్ దేవర. ఈ మూవీ షూటింగ్ షురూ అయిన దగ్గర నుంచి ఫ్యాన్సులో ఎంతో క్యూరియాసిటీ నెలకొంది. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వస్తోన్న కాంబినేషన్ కావడం ఒక ఎత్తయితే ఎన్టీఆర్ సోలో గా వచ్చి దాదాపు ఆరేళ్ళు అవుతుండటంతో ఈ దేవర మూవీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 2018లో వచ్చిన అరవింద సమేత మూవీ తరువాత ఆర్ఆర్ఆర్ ట్రాక్ లోకి రావడం.. ఇవన్నీ జరిగి ఈ దేవర రిలీజ్ టైం వచ్చేసరికి ఆరేళ్ళు అవడంతో ఫ్యాన్న్స్ సైతం ఈగర్ గా వేచిచూస్తున్నారు..ఈ ఎదురు చూపులకు తెరదించుతూ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్.
టైం ఫిక్స్.. దేవర గ్లింప్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్
దేవర సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను జనవరి 8న సోమవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. సముద్రంలో నుంచి రక్తపు మరకలు అంటిన ఆయుధాన్ని పైకి తీస్తున్న చిన్న వీడియోతో చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.ఈ ట్వీట్ చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దేవర గ్లింప్స్ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.
Unleashing fear in 2 days 🌊🌊🌊
Man of Masses #NTR’s #DevaraGlimpse will deliver a massive feast on Jan 8th at 4:05 PM 🔥#Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @Yugandhart_ @YuvasudhaArts… pic.twitter.com/RUP0WYm93j
— Anirudh Ravichander (@anirudhofficial) January 6, 2024
జక్కన్న సెంటిమెంట్ బ్రేక్ చేసే దిశగా
ఆచార్య డిజాస్టర్ తరువాత వస్తోన్న మూవీ కావడంతో కాస్త టెన్షన్ లో ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరో వైపు జక్కన్న తో సినిమా చేస్తే ఆ హీరోకి నెక్స్ట్ సినిమా డిజాస్టర్ గా మారడం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో రామ్ చరణ్ కు ఆర్ఆర్ ఆర్ తరువాత ఆచార్య డిజాస్టర్ వచ్చేసింది. ఇప్పుడు భయం అంతా దేవర మూవీపైనే ఉంది. జక్కన సెంటిమెంట్‌ను బ్రేక్ చేసే పనిలో చాలా జాగ్రత్తలు తీసుకొని దేవర మూవీ చేస్తున్నారు కొరటాల శివ .
డ్యూయల్ రోల్స్ లో ఎన్టీఆర్
దేవర మూవీలో అండర్ వాటర్ సీన్లు హైలెట్‌గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్ వర్క్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ చిత్రీకరించిన సీన్స్ దేవర్లో కనువిందు చేస్తాయని ఇంసైడ్ వర్గాల టాక్ .ఇక.. ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా , బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ద్విపాత్రాభినయంలో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా అలరించబోతోన్న ఈ మూవీకి యంగ్ సన్షేషన్ అనిరుధ్ మ్యూజిక్ ప్రధాన బలం. చూడాలి మరి .. గ్లింప్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో.
ALSO READ:Peter Hein Hero:రాజమౌళి స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ హీరోగా పాన్ ఇండియా మూవీ