Ram Charan- Upasana: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన గతేడాది క్లీంకారకు (Klinkara) జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక క్లీంకార పుట్టినప్పటి నుంచి ఆమెకు సంబంధించిన ప్రతీ విషయం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవలే క్లింకార కేర్ టేకర్ సాలరీకి సంబంధించిన వార్తలు కూడా నెట్టింట తెగ వైరలయ్యాయి. ప్రస్తుతం క్లింకార కేర్ టేకర్ గా వ్యవహరిస్తున్న లలిత గతంలో అంబానీ కుటుంబంలో చిన్నారులకు కూడా కేర్ టేకర్ గా పనిచేశారు.
రామ్ చరణ్ -ఉపాసనల పై కేర్ టేకర్ లలిత కామెంట్స్
అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న క్లీంకార కేర్ టేకర్ లలిత రామ్ చరణ్-ఉపాసన దంపతుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేర్ టేకర్ లలిత మాట్లాడుతూ.. “గతంలోనూ తాను అంబానీ ఫ్యామిలీతో సహా అనేక సంపన్న కుటుంబాల్లోని పిల్లలకు కేర్ టేకర్ గా పనిచేశాను. తనను అందరూ చాలా బాగా చూసుకున్నారని తెలిపింది. ఉపాసన, రామ్ చరణ్ క్లింకార విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తారని. మంచి తల్లిదండ్రులకు వాళ్ళు ఉదాహరణ అని. ఉపాసన అపోలో ఫౌండేషన్ ఛైర్మెన్ గా ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారని. పాప విషయంలో తనను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని. తాను రెస్ట్ తీసుకునే సమయంలో ఉపాసనే పాపను చూసుకుంటారని. వారిద్దరిదీ మంచి మనసు అని చెప్పుకొచ్చింది.” వారి కుటుంబంలో తనను ఒక సభ్యురాలిగానే చూస్తారని సంతోషం వ్యక్తం చేసింది లలిత.
Also Read: HBD Mrunal Thakur: ‘ఓ సీతా వదలనిక తోడౌతా’… హ్యాపీ బర్త్ డే మృణాల్ – Rtvlive.com