Upasana – Ram Charan : గ్లోబల్ స్టార్(Global Star) రామ్ చరణ్(Ram Charan) భార్యగానే కాకుండా, బిజినెస్ ఉమెన్(Business Woman) గా కూడా ఉపాసన(Upasana) చాలా పాపులర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్ గా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉపాసన తన సోషల్ మీడియా(Social Media) లో షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా, ఉపాసన తన కూతురు క్లిన్ కారా(Klin Kaara) తో కలిసి హైదరాబాద్(Hyderabad) లో గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ని కలిశారు. అందుకు సంబంధించిన పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
Also Read : విడాకులకు సిద్దమైన రాజ్.. బెడిసికొట్టిన ఇందిరాదేవి ప్లాన్.. ముక్కలైన కావ్య జీవితం..!
pleasure to meet the Hon’ble President of India Smt.Droupadi Murmu Ji with KlinKaara Konidela at the @heartfulness Global Spirituality Mahotsav
Thank you @kamleshdaaji ,u really make the world a better place.I just had to bring my baby to experience & embrace all the positivity pic.twitter.com/bZFTJa83CB— Upasana Konidela (@upasanakonidela) March 15, 2024
ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ లో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముజీ గారిని నా కుమార్తె క్లిన్ కారా కొణిదెలతో కలవడం చాలా ఆనందంగా ఉందని కామెంట్స్ చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కామేష్ దాజి మీకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.
దీంతో ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే, ఈ వేడుకలో కూడా క్లీంకార ముఖం కనిపించకుండా ఉపాసన చాలా జాగ్రత్త పడ్డారు. దీంతో మెగా అభిమానులు ఇంకెప్పుడు ఈ మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ ని చూపిస్తారు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.