Rinku Singh can end up being a brilliant finisher like MS Dhoni and Yuvraj Singh: యువరాజ్ సింగ్, ధోనీలో ఇప్పటివరకు ఒకర్ని కూడా రిప్లేస్ చేయలేకపోయింది బీసీసీఐ. వన్డేల్లో అటు నంబర్-4 పొజిషన్ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం 8 ఏళ్లుగా బీసీసీఐ కష్టపడుతూనే ఉంది. ఇటు ధోనీ లాంటి ఫినిషర్ సంగతి సరేసరి. మాట్లాడుకోని కూడా టైమ్ వేస్ట్. అయితే ఒక్క నిమిషం ఆగండి.. ఈ ఇద్దరిలో ఒకరిని కాదు.. ఇద్దరిని రిప్లేస్ చేసే టాలెంట్ ఉన్న ప్లేయర్ ఒకడున్నాడు. ఐపీఎల్లో లాస్ట్ ఓవర్లో 5సిక్సులు కొట్టి గుజరాత్ టీమ్‌కి షాక్ ఇచ్చిన బ్యాటర్ ఎవరో గుర్తున్నాడు కదా? ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన రింకు సింగ్ గురించే ఇదంత! నిజానికి రింకు చాలా కాలంగా నిలకడగానే రాణిస్తున్నా.. కోల్‌కతా వర్సెస్ గుజరాత్ మ్యాచ్ తర్వాత రింకు సింగ్ పేరు ప్రపంచ క్రికెట్లో మారుమోగింది. ఆ ఒక్క మ్యాచ్‌తోనే రింకు సింగ్ ఆగిపోలేదు.. తర్వాత మ్యాచ్‌ల్లోనూ తన ప్రతాపం చూపించాడు.
ఐర్లాండ్‌తో సిరీస్‌కు ఎంపిక:
ఐపీఎల్‌తో పాటు డొమెస్టిక్ క్రికెట్లోనూ సత్తా చాటిన రింకు సింగ్ ప్రస్తుతం ఐర్లాండ్ టూర్లో ఉన్నాడు. మొదటి టీ20లో వర్షం కారణంగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ రింకుకు రాలేదు. ఇదే సమయంలో భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్ లాంటి గొప్ప ఫినిషర్‌గా ఎదిగే సత్తా రింకు సింగ్‌కు ఉందని కిరణ్ మోరే అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో ఇప్పటికే ఈ విషయం ప్రూవ్ అయ్యిందని.. చాలా సింపూల్‌గా రింకు మ్యాచ్‌లను ముగించేశాడని గుర్తుచేశాడు. ధోనీ, యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్లను వారి రిటైర్మెంట్ తర్వాత చూడలేదని.. రింకు సింగ్‌కి ఆ స్థాయి సత్తా ఉందన్నాడు మోరే. రింకు చాలా తెలివైన ఫీల్డర్ కూడా అని.. దేశవాళీ క్రికెట్లో కూడా అతన్ని చూశానని.. అప్పటికీ ఇప్పటికీ రింకులో చాలా మార్పు వచ్చిందని చెప్పాడు మోరే.
అభిషేక్ నాయర్ ఏమన్నాడంటే:
మాజీ భారత క్రికెటర్ అభిషేక్ నాయర్ టీమిండియాకు విలువైన సూచనలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌ని దృష్టిలో ఉంచుకోని రింకు సింగ్‌కి అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని.. టీమ్‌తోనే ఉండేలాగా బీసీసీఐ ప్లాన్ చేసుకోవాలని సజెస్ట్ చేశాడు. దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన రన్ గెటర్ రింకు అని.. అలాంటి ఆటగాడిని ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత మేలు అని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఫినిషర్ పాత్రని రింకు సెట్ అవుతాడన్నాడు నాయర్. ఈ ఏడాది ఐపీఎల్లో 13 ఇన్నింగ్స్‌లలో 145.45 సగటుతో 416 పరుగులు చేశాడు రింకు. ఇందులో మూడు అర్ధసెంచరీల ఉన్నాయి. నంబర్ 5, నంబర్ 6 పొజిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. డెత్ ఓవర్లలో కనీసం 75 బంతులు ఎదుర్కొన్న 12 మంది బ్యాటర్లలో, రింకు స్ట్రైక్ రేట్ 186.67గా ఉంది. రింకు కంటే ముందు హెన్రిచ్ క్లాసెన్ (187.36) మాత్రమే ఉన్నాడు.