King Of Kotha Movie Review in Telugu:
నటీనటులు – దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, ప్రసన్న, నైలా ఉష, గోకుల్ సురేష్ తదితరులు..
డైరక్టర్ – అభిలాష్ జోషి
ప్రొడ్యూసర్ – వేఫెవర్ ఫిలిమ్స్, జీ స్టుడియోస్
మ్యూజిక్ – జేక్స్ బిజాయ్
ఎడిటర్ – శ్యామ్ శశిధరన్
రన్ టైమ్ – 2 గంటల 56 నిమిషాలు
సెన్సార్ – U/A
రేటింగ్ – 2/5
కింగ్ ఆఫ్ కొత్త సినిమాలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పేరు రాజు. కొత్త అనే పట్టణంలో రౌడీ. కొత్త పట్టణంలో రాజుకి తిరుగేలేదు. ఇంకా చెప్పాలంటే ఆ టౌన్ కి అతడు చెప్పిందే వేదం. తండ్రి బాటలో రౌడీగా మారిన రాజు.. ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత అతడి జీవితమే మారిపోతుంది. సొంతూరిలో రాజులా ఉన్న రాజు, ప్రియురాలి కోసం ఊరు విడిచి లక్నో వెళ్లిపోతాడు. లక్నో వెళ్లిన తర్వాత ఏం జరిగింది, రాజు వెళ్లిపోయిన తర్వాత కొత్త టౌన్ లో జరిగిన పరిణామాలు ఏంటి, వాటిని రాజు ఎలా సాల్వ్ చేశాడు అనేదే అసలు కథ.
అసలు సినిమా ఉంది అనే విషయం కాసేపు పక్కన పెడితే.. సినిమా పేరుతోనే ఆడియన్స్ కు బోలెడన్నీ డౌట్లు ఉన్నాయి. కింగ్ ఆఫ్ కొత్త అని, కింగ్ ఆఫ్ కోత అని ఆడియన్స్ అనుకుంటున్నారు. పేరులోనే ఇన్ని సందేహాలు ఉంటే ఇక ఆడియన్స్ థియేటర్ వరకు ఏం వస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సినిమాకు రిలీజ్ కు ముందు బాగా పబ్లిసిటీ చేసినా ఆడియన్స్ ని మాత్రం థియేటర్ వరకు రప్పించలేకపోయారు. పోనీ థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడికైనా సినిమా నచ్చిందా అంటే తెలీని పరిస్థితి. ప్రతీ సీన్ ఎక్కడో ఒక సినిమాలో చూసినట్లుగానే కన్పిస్తుంది. కాసేపు దసరాలా, కాసేపు కేజీఎఫ్ (KGF) లా కన్పిస్తుంది.
గ్యాంగ్ స్టర్ డ్రామా.. దుల్కర్ కిది కొత్త సబ్జక్టే
సినిమా అంతా ఓవరాల్ గా ఫర్వాలేదు అన్పిస్తుంది కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం… అద్భుతమైన సినిమాకు వచ్చామన్నా ఫీలింగ్ అయితే రాదు. అయితే ఓవరాల్ గా అర్థమైంది ఏంటింటే.. దుల్కర్ సల్మాన్ కు ఉన్న ప్యాన్ ఇండియా క్రేజ్ ని వాడుకుని ఏదో ఒకటి తీసేద్దాం అని తీశారే తప్ప ఆడియన్స్ కు నచ్చాలి, అద్భుతమైన హిట్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తో తీసినట్లుగా ఎక్కడా అన్పించదు. దుల్కర్ కూడా ఇప్పటివరకు తను టచ్ చేయని గ్యాంగ్ స్టర్ డ్రామా సబ్జెక్ట్ కావడంతో, వెంటనే ఓకే చెప్పినట్టున్నాడు. అన్నింటికి మించి రన్ టైమ్ ఈ సినిమాకు పెద్ద మైనస్. సినిమా చాలా భారంగా నడుస్తూ ఉంటుంది. అక్కడక్కడా ఇంకా ట్రిమ్ చేసుకుని ఉండాల్సింది.
ఇక నటీనటుల పర్పార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే.. దుల్కర్ సల్మాన్ ఎలాంటి పాత్ర అయినా చేయగలడని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. యాక్షన్ సన్నివేశాల్లోనూ అద్బుతంగా నటించి మెప్పించాడు. తన లుక్స్ లో వేరియేషన్ చూపించడమే కాదు.. యాక్టింగ్ లోనూ ఔరా అన్పించాడు. ఐశ్వర్య లక్ష్మి, అనిఖా సురేంద్రన్, పోలీస్ అధికారిగా ప్రసన్న తమ పరిధి మేరకు నటించారు. రితికా సింగ్ స్పెషల్ సాంగ్ సినిమాకు ఎట్రాక్షన్.
డైరెక్టర్ అభిలాష్ జోషీ (Abhilash Joshiy) చెప్పాలనుకున్న స్టోరీ ఓకే అనిపిస్తుంది. కానీ, దానిని ప్రెజెంట్ చేసిన విధానం అంత బాగోలేదు. హీరోను ఎలివేట్ చేసిన సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఓవరాల్ గా కింగ్ ఆఫ్ కొత్త సగటు ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టమే. ఒక్కసారి సరదాగా అలా థియేటర్ కు వెళ్లి చూద్దాం అనుకుంటే వన్ టైమ్ వాచబుల్.
Also Read: రామ్ హీరోగా బోయపాటి యాక్షన్ థ్రిల్లర్