Chiranjeevi Next Movie: సౌత్ ఇండియన్ సెన్సేషన్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ఆయన పేరు వింటేనే అభిమానులలో పూనకాలు వస్తాయి. స్వయం కృషితో పైకి వచ్చిన అయన వ్యక్తిత్వానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
సినిమాల్లో తన నటన, అభినయంతో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొని అంచలంచలుగా ఎదుగుతూ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. 60 ఏళ్ల అయన సినీ జీవితంలో ఆయన ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
‘పునాది రాళ్లతో’ మొదలైన అయన సినీ ప్రస్థానం 100కు పైగా సినిమాలను దాటింది. ‘నంది అవార్డు’, ‘పద్మ భూషణ్’ లాంటి గొప్ప అవార్డులను ఆయనను వరించాయి. ఆయన జీవితంలో ఒక మైలు రాయిగా నిలిచిన ‘ఖైదీ’ సినిమా ప్రేక్షకులకు ఆయన్ని మరింత దగ్గర చేసింది.
చిరంజీవి సినీ జీవితంలో ‘ఖైదీ’ సినిమా మర్చిపోలేని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్ గా త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో ఖైదీ సినిమాకు సీక్వెల్ రాబోతుంది అంటూ నెట్టింట్లో బజ్ నడుస్తుంది. అయితే ఖైదీ సినిమా క్లైమాక్స్ లో.. ‘పగ తీర్చుకోవడం కోసం ఈ జన్మ ఎత్తాను. ప్రేమ కోసం మరోజన్మ ఎత్తుతాను. అప్పుడు కలుసుకుందాం’. అనే డైలాగ్ తో ముగుస్తుంది.
డైరెక్టర్ త్రివిక్రమ్ ఇదే డైలాగ్ ను స్టోరీ లైన్ గా తీసుకొని సినిమా తీయబోతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాల్లో త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ప్రేక్షకుల్లో తెలియని జోష్ ని క్రియేట్ చేస్తాయి. ఇక చిరంజీవి సినిమా అనగానే అయన అభిమానులకు పూనకాలే. సినిమా గురించి త్రివిక్రమ్, చిరంజీవిని కలిసినట్లుగా కూడా వార్తలు వినిపించాయి.
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే, మెగాస్టార్ అభిమానులకి పండగే. ప్రస్తుతం త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ సినిమాలో బిజీ గా ఉన్నారు. చిరంజీవి కూడా రెండు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ తో ఒక సినిమా, ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ పతాకం పై మరో సినిమా చేయనున్నారు. ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ అయ్యాక, చిరంజీవి తో ‘ఖైదీ’ సినిమాకు సిద్ధం అవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Varun Tej – Lavanya Marriage: మెగా ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు.. వరుణ్ లావణ్య ల పెళ్లి డేట్ ఫిక్స్ ..?