Kesineni Chinni : కేశినేని నాని ఓ దద్దమ్మ..విజయవాడ ఎంపీగా నా గెలుపు ఖాయమన్నారు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని. రెండేళ్లుగా విజయవాడ పార్లమెంట్ పరిధితో తాను పర్యటిస్తున్నానని..ఈ సారి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు కేశినేని చిన్ని. రెండుసార్లు ఒక దద్దమ్ను నమ్మి విజయవాడ ప్రజలు గెలిపించారని..నోరు తెరుస్తే అబద్దాలు మాట్లాడే కేశినేని నానిని చిత్తుగా ఓడించడం ఖాయమన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నాని ఓటమి నాలుగేళ్ల ముందే డిసైడ్ అయ్యిందన్న కేశినేని చిన్ని ఆర్టీవీతో సంచనల వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లో ఆ తెలంగాణ పార్టీ విలీనం..!