Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం ఈడీ ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ కేసులో కవితపై (Kavitha) ఈడీ అభియోగాలు నమోదు చేసింది. మొత్తం లిక్కర్ స్కాం విలువ రూ.1100 కోట్లు అని.. అందులో కవితకు ముట్టినవి రూ. 292 కోట్లు అని.. ఆప్ నేతలకు రూ. 100 కోట్లు అని ఈడీ ఛార్జిషీట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కవిత తన ఫోన్లో సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఈడీ (ED) తెలిపింది. మరోవైపు ఇవాళే కవిత రిమాండ్ జులై 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
Also Read: ఏపీ-తెలంగాణలో అనూహ్యమైన మార్పులు.. RTV పోస్ట్ పోల్ స్టడీ వివరాలివే!