Udayanidhi Stalin: తమిళనాడు క్రీడామంత్రి ఉదయనిధి స్టాలిన్ కు కర్నాటక కోర్టు సమన్లు జారీ చేసింది. స్టాలిన్ గతేడాది సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో మార్చి4వ తేదీని కోర్టులో హాజరుకావాలంటూ ఆదేశించింది. సనాతన ధర్మం డెంగ్యూ,మలేరియా లాంటిందని ఉదయనిధి స్టాలిన్ గతేడాది చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. చాలా మంది ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. అతితీవ్ర వ్యాఖ్లయు కూడా స్టాలిన్ పై చేశారు. ఎన్నికల్లోనూ ఈ విషయంపై తీవ్ర చర్చే జరిగింది. ఇండియా కూటమి ఎమ్మెల్యేనే ఈ వ్యాఖ్యలుచేశారని..కాంగ్రెస్ వైఖరి కూడా ఇదేనా అంటూ ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నలు సంధించాయి.
కానీ స్టాలిన్ మాత్రం తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. తాను తప్పేమీ మాట్లాడలేదని సమర్ధించుకున్నారు. మరోవైపు ఉదయనిధిని హిట్లర్‌తో పోలుస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. “హిట్లర్ యూదులను ఎలా ప్రస్తావించాడు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వివరించిన విధానానికి మధ్య అసాధారణమైన సారూప్యత ఉంది.హిట్లర్ లాగే ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అంటున్నారు. నాజీ ద్వేషం హోలోకాస్ట్‌కు ఎలా దారి తీసిందో మనకు తెలుసు. ఇది దాదాపు 6 మిలియన్ల యూరోపియన్ యూదులను, ఇతర బాధితులలో కనీసం 5 మిలియన్ల సోవియట్ యుద్ధ ఖైదీలను చంపింది. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్య ద్వేషపూరిత ప్రసంగం…సనాతన ధర్మాన్ని అనుసరించే భారతదేశంలోని 80 శాతం మంది ప్రజలను నరమేధం చేయాలని అతను పిలుపునిచ్చాడు అంటూ బీజేపీ మండిపడింది.
ఇది కూడా చదవండి: ఈనెల 4న తెలంగాణ మంత్రివర్గం భేటీ..బడ్జెట్ సమావేశాలపై చర్చ..!!
కాగా ఈ విషయంపై పరమేశ్ అనే వ్యక్తి కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్‌ను కర్నాటక ప్రజా ప్రతినిధుల కోర్టు స్వీకరించింది.ఉదయనిధి స్టాలిన్‌కు సమన్లు పంపింది. మార్చి 4వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.