Kalonji Water: సహజంగా ఇంట్లో జిలకరను ఒక స్పైస్ లా వాడుతుంటాము. రోజూ తినే ఆహారంలో రుచి, ఫ్లేవర్ కోసం వీటిని మనం చేసుకునే వంటకాల్లో వేస్తాము. వీటిలో ఐరన్, విటమిన్ C, ఫైబర్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియ సమస్యలు, ఇన్ఫెక్షన్స్, ను తగ్గిస్తాయి. జిలకరలో మూడు రకాలు ఉంటాయి. తెల్ల జిలకర, నల్ల జిలకర అండ్ బ్రౌన్ కలర్. వీటిలో నల్ల జిలకర గురించి తక్కువ మందికి తెలుసు. కానీ రోజూ ఉదయాన్నే నల్ల జిలకర నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా లాభాలు.
నల్ల జిలకర నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య లాభాలు
నల్ల జిలకర నీటిని రోజు ఉదయాన్నే తాగితే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి.
బరువు తగ్గడంలో సహాయం
ఈ నీటిని ప్రతీ రోజూ తాగితే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ శరీరంలో అధిక కొవ్వును తొలగించును. అలాగే వీటిలోని పోషకాలు చాలా సమయం వరకు ఆకలి లేకుండా చేసి బరువు తగ్గడంలో సహాయపడును.
చక్కర స్థాయిలను నియంత్రించును
మధుమేహం సమస్య ఉన్న వారు ఈ జిలకర నీటిని తీసుకుంటే ఇవి శరీరంలోని గ్లైసెమిక్ స్థాయిల పై మంచి ప్రభావాన్ని చూపి.. రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడును.
రోగనిరోధక శక్తిని పెంచును
వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని మెరుగుపరచి వ్యాధుల నుంచి కాపాడును.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుచును
నల్ల జిలకర నీటిలోని యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉండడానికి సహాయపడును. ప్రతీ రోజు ఉదయాన్నే ఈ నీటిని తాగితే ఆరోగ్యం పై మంచి ప్రభావం చూపును.
నోటి ఆరోగ్యానికి సహాయపడును
జిలకర నీళ్లు నోటి ఆరోగ్యాన్ని మెరుగ్గా చేయడంతో పాటు నోటి సంబంధిత సమస్యలను దూరం చేయడంలో తోడ్పడును.
Also Read: Mushroom Benefits: వామ్మో మష్రూమ్ తింటే.. ఇలా జరుగుతుందా..!