Kalki 2898AD Poster: ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా సినిమా .. భారీ బడ్జెట్ సినిమా ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కల్కి 2898 AD. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమా నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘కల్కి’ గ్లింప్స్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది.
Also Read: NBK109 Glimpse : బాలయ్య NBK 109 గ్లింప్స్ .. ఫ్యాన్స్ కు పూనకాలే
కల్కి పోస్టర్.. ప్రభాస్ లుక్ అదిరిపోయింది
ఇది ఇలా ఉంటే.. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా ఈ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సినిమాలోని ప్రభాస్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. కాశీ భవిష్యత్తు వీధుల నుంచి భైరవను పరిచయం చేస్తున్నాము అంటూ ప్రభాస్ లుక్ ను రివీల్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించేలా ఉంది. స్టైలిష్ గాగుల్స్, స్లీవ్ లెస్ డ్రెస్, జిమ్ బాడీ పై పెద్ద పెద్ద టాటూస్, ట్రెండీ హెయిర్ స్టైల్ తో నెక్స్ట్ లెవెల్ లో ఉన్నారు. ఇక సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్ పోస్టర్ చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్టార్ కాస్ట్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్త్, స్వప్న దత్త్ , ప్రియాంక దత్త్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
From the future streets of Kasi, Introducing ‘BHAIRAVA’ from #Kalki2898AD.#Prabhas #Kalki2898ADonMay9@SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @shreyasgroup pic.twitter.com/2hFB6PWk27
— Shreyas Media (@shreyasgroup) March 8, 2024
Also Read : Samantha: సమంతతో తిరుమలలో ప్రత్యక్షమైన ప్రీతం.. మరోసారి టాలీవుడ్ లో గుసగుసలు