WWE: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE)తెలుసు కదా. ఈ ఆట గురించి తెలియని వారుండరు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ పోటీలను ఆసక్తిగా చూస్తుంటారు. అందులో ఆడే ప్లేయర్లకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. వారి లాగే కొట్టడం, వారి ఫేవరెట్ షాట్స్ వేయడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి స్టార్లను అభిమానులు దగ్గరిగా చూసే అవకాశం వస్తే ఇంకేముంది ఒక్క క్షణం కూడా ఆగరు. ఇప్పుడు ఆ అవకాశమే హైదరాబాద్‌లో దొరికింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ(WWE) సూపర్ స్టార్ స్పెక్టకిల్ ఈవెంట్ జరుగుతోంది. మొత్తం 28 మంది దేశీయ, అంతర్జాతీయ రెజ్లర్లు ఈ ఈవెంట్లో తలపడుతున్నారు. దీంతో తమ అభిమాన ప్లేయర్లను చూసేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు. స్టేడియం మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. పోలీసులు స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
డ్యాన్స్ అదరగొట్టిన సూపర్ స్టార్స్..
ఇక ఈవెంట్ మొదటి మ్యాచ్‌లో ఇండియన్ స్టార్ రెజ్లర్లు.. వీర్ మహాన్, సంగా, జిందల్ మహాన్లతో.. విదేశీ రెజ్లర్లు కెవిన్ ఓవెన్స్, డ్రూ మెకింటైర్, శామీ జేన్ తలపడ్డారు. రసవత్తరంగా జరిగిన మ్యాచులో కెవిన్ జట్టు విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం.. గెలుపు ఓటములను పక్కన బెట్టిన ఆరుగురు ప్లేయర్లు స్టేజ్‌పై డ్యాన్స్ వేశారు. ఆస్కార్ అవార్డు అందుకున్న RRR మూవీలోని నాటు నాటు పాటకు చిందులు వేశారు. దీంతో స్టేడియం అంతా మార్మోగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నాటు నాటు పాటకు డాన్స్ వేసిన WWE స్టార్స్ pic.twitter.com/y5VdO6Hi0V
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2023
సూపర్ స్టార్ జాన్‌సీనాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వేరే లెవల్. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అభిమానులు ఉన్నారు. సీనాతో ఫొటో దిగేందుకు, చూసేందుకు ఎగబడుతూ ఉంటారు. అలాంటి జాన్‌సీనా కూడా హైదరాబాద్ రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నా సీనాను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘జాన్‌సీనా.. జాన్‌సీనా’ నినాదాలతో హోరెత్తించారు.
A great pleasure meeting you @JohnCena. Thank you for being so kind and warm. It’s wonderful how you could make everyone feel special in those few minutes. Hustle Loyalty Respect – felt all of that 🙂 #WWESuperstarSpectacle Hyderabad.@WWEIndia @SonySportsNetwk pic.twitter.com/phcsUhtbVD
— Karthi (@Karthi_Offl) September 8, 2023
ఇక జాన్‌సీనాకు తమిళ స్టార్ హీరో కార్తీ వీరాభిమాని. జాన్‌సీనాను చూసేందుకు కార్తీ బాలయోగి ఇండోర్ స్టేడియంకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కార్తీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటో కూడా వైరల్ అవుతోంది. తర్వాత చిత్రంలో జాన్‌సీనాకు అవకాశం ఇవ్వాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: సచిన్ కు గోల్డెన్ టికెట్ అందించిన షా!