Situation for job interview in Hyderabad: హైదరాబాద్ లో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పట్టే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం ఒకే ఒక్క పోస్టుకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించగా వేల మంది నిరుద్యోగులు పొటెత్తారు. వచ్చిన నిరుద్యోగులతో ఆ ఆఫీసు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఓ అభ్యర్థి దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
Situation of walk-in interviews in India. This is in Hyderabad. pic.twitter.com/DRyz4R4YgM
— Indian Tech & Infra (@IndianTechGuide) November 1, 2023
హైదరాబాద్(Hyderabad) లోని ఓ ఐటీ కంపెనీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకే ఒక్క సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఖాళీగా ఉండడంతో.. అర్హులైన అభ్యర్థులు రెజ్యూమ్ తో వాక్ ఇన్ ఇంటర్వ్యూ(Walk in Interview) కు హాజరు కావాలని టైం, డేట్ ప్రకటించింది. ఉన్నది ఒకటే పోస్టు కావడంతో ఇరవై మందో ముప్పై మందో వస్తారని కంపెనీ యాజమాన్యం భావించింది. అయితే, ఇంటర్వ్యూ కోసం ఏకంగా వందలాది మంది తరలిరావడంతో వారు ఆశ్చర్యపోయారు. దీంతో, వచ్చిన వారందరినీ కంట్రోల్ చేయడానికి ఆ కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది నానా తంటాలు పడ్డారు. జాతరను తలపించేలా కనిపించిన నిరుద్యోగులను చూసి హెచ్ ఆర్ సిబ్బంది కంగుతిన్నారు.
Also Read: హ్యాపీ బర్త్డే..! కంగారులను కంగారు పెట్టించిన లక్ష్మణుడు..!
ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నిరుద్యోగానికి ఈ వీడియో అద్దం పడుతోందని ఒకరు కామెంట్ చేయగా.. ఐటీ రంగంలో స్వర్ణయుగం ముగిసినట్లేనని మరొకరు కామెంట్ చేశారు. ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారని, వారందరికీ ఉద్యోగాలు దొరకడం కష్టమని పలువురు అభిప్రాయపడ్డారు. స్టార్టప్ లపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.