JEE Advanced 2024: దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే JEE అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 21 నుంచి 30 వరకు ఆన్లైన్లో అడ్వాన్స్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. ఈ తేదీల్లో మార్పు చేసినట్లు ఐఐటీ- మద్రాస్ ప్రకటించింది. దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 27 నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అయితేపరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. తొలుత ప్రకటించిన ప్రకారంగానే మే 26వ తేదీన యథాతథంగా పరీక్ష జరుగుతుందని తెలిపింది.
మే 26న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష:
ఐఐటీ అడ్మిషన్‌కు సంబంధించిన పరీక్ష ఆదివారం, మే 26న జరగనుంది. రెండు పేపర్లు ఉన్నాయి.పేపర్ 1 మొదటి షిఫ్ట్‌లో, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 రెండవ షిఫ్ట్‌లో, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు నిర్వహించబడుతుంది.జేఈఈ అడ్వాన్స్‌డ్‌పై లోక్‌సభ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపబోవని, ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్ష జరుగుతుందని ఐఐటీ మద్రాస్ ఇటీవలే తెలియజేసింది.
JEE అడ్వాన్స్డ్ పరీక్ష ఫీజు చెల్లింపు, అడ్మిట్ కార్డ్:
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 10 (సాయంత్రం 5). అడ్మిట్ కార్డులు మే 17 ఉదయం 10 గంటలకు విడుదల చేయబడతాయి.
జూన్ 2న తాత్కాలిక సమాధానాల కీ:
అభ్యర్థుల సమాధానాల కాపీలు మే 31న పరీక్ష పోర్టల్‌లో ఉంటాయి. తాత్కాలిక సమాధానాల కీ జూన్ 2న విడుదల అవుతాయి. అభ్యర్థులు జూన్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుండి జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రొవిజనల్ ఆన్సర్ కీపై తమ అభిప్రాయాన్ని,వ్యాఖ్యలను పంపవచ్చు.
జూన్ 9న ఫైనల్ ఆన్సర్ కీ:
JEE అడ్వాన్స్డ్ 2024 ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ జూన్ 9న విడుదల అవుతాయి. ఆ తర్వాత, జాయింట్ సీట్ కేటాయింపు (JoSAA) ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT 2024) ద్వారా IIT కౌన్సెలింగ్ కోసం నమోదు ప్రారంభమవుతుంది. JEE అడ్వాన్స్డ్ 2024 గురించి మరింత సమాచారం కోసం, దిగువ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి: 150 సీట్లతో కొత్త బయో మెడికల్ కోర్సు..పూర్తి వివరాలివే.!