Jawan Box Office Collection Day 1: బాలీవుడ్ బాద్షా.. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan).. మరోసారి బాక్సాఫీస్ బాద్షా అనిపించున్నారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా గురువారం విడుదలైన ‘జవాన్’ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. దేశవ్యాప్తంగా ఫస్ట్ డే వసూళ్లలో గత చిత్రాల రికార్డును బదలుగొట్టింది. తొలిరోజు రూ.129.6 కోట్ల గ్రాస్ .. రూ.75కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో భారత్‌తో తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన హీరోగా కింగ్ ఖాన్ చరిత్ర సృష్టించారు. తమిళ, తెలుగు భాషల్లో కలిపి రూ.10కోట్ల వరకు కలెక్టు చేసిందని ట్రేడ్ అనలిస్ట్స్ చెబుతున్నారు.
రూ.1000 కోట్లు వసూళ్లు పక్కా..
తన గత చిత్రం ‘పఠాన్’ (Pathaan) రికార్డును కూడా బ్రేక్ చేశారు. పఠాన్ చిత్రం ముందు వరకు షారుఖ్ కెరీర్ పూర్తి డల్‌గా ఉండేది. వరుస ఫ్లాపులతో డీలా పడిపోయారు. ఇక షారుఖ్ పని అయిపోయిందనే విమర్శలు వచ్చాయి. అయితే రెట్టించిన ఉత్సాహంతో సినిమా ఇప్పుడే మొదలైందంటూ పఠాన్ మూవీతో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ చిత్రం రూ.1000కోట్లు వసూళ్లు సాధించింది. ఇప్పుడు జవాన్ కూడా రూ.1000 కోట్లు వసూళ్లు సాధించడం పక్కా అని చెబుతున్నారు. ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలతో షారుఖ్ ఒక్కసారిగా ఓపెనింగ్ డే రికార్డ్స్ లెక్కలు మార్చేశారు.
#JAWAN DAY-1
WORLDWIDE BOX-OFFICE ₹129.6CR#JawanBoxOffice #ShahRukhKhan𓃵 pic.twitter.com/fLt7rPf7hZ— CINEMATENT🍿 (@CINEMATENT) September 8, 2023
Also Read: జైలర్..బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్
రికార్డు కలెక్షన్స్ వచ్చే అవకాశం..
జవాన్ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించగా.. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ పాత్రలో నటించారు. నయనతార, దీపికా పదుకొనే కీలక పాత్రల్లో కనిపించారు. ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్ రావొచ్చని చెబుతున్నారు. అలాగే శనివారం, ఆదివారం సెలవు కావడంతో రికార్డు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా చేస్తున్నారు.
జవాన్ తర్వాత లిస్టులో ఉన్న చిత్రాలు..
ఇక జవాన్ మూవీ తర్వాత ‘పఠాన్’ రూ. 60 కోట్లతో రెండో స్థానంలో ఉంది. కేజీఎఫ్2 రూ. 52.40 కోట్లు, వార్ చిత్రం రూ. 50.65 కోట్లు, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ రూ. 48.25 కోట్లు, భారత్ రూ. 41.65 కోట్లు, బాహుబలి 2 రూ. 40.75 కోట్లు, ప్రేమ్ రతన్ ధన్ పాయో రూ. 39.30 కోట్లు, గదర్ 2 రూ. 39 కోట్లు ఓపెనింగ్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Also Read: జవాన్ బ్లాక్ బస్టర్..మహేష్ ట్వీట్ వైరల్!