Javed Akhtar: లెజండరీ గేయ రచయిత జావేద్ అక్తర్ స్క్రీన్ రైటర్, స్వరకర్తగా ప్రసిద్ధి చెందారు. ఎన్నో అద్భుతమైన పాటలకు తన సాహిత్యాన్ని అందించారు. 1973లో ‘జంజీర్’, 1975లో విడుదలైన ‘దీవార్’, ‘షోలే’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు స్క్రీన్ రైటర్ గా పనిచేశారు.
అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గేయ రచయిత జావేద్ అక్తర్ మద్యపాన సమస్య గురించి బహిరంగంగా మాట్లాడారు. ఒకానొక సమయంలో తాను పూర్తిగా మద్యానికి బానిసయినట్లు తెలిపారు.
జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. “కెరీర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్న సమయంలో మద్యపానం అలవాటు ఎక్కువైంది. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా ఎంతో నష్టపోయా. నా భావోద్వేగాలు నా ఆధీనంలో ఉండేవి కావు. ఊరికే కోపం వచ్చేది. ఆ తర్వాత మద్యం మానుకోవాలని నిర్ణయించుకున్నాను. జూలై 31, 1991 నేను మద్యం ముట్టిన చివరి రోజు. మద్యపానం వల్ల పదేండ్ల విలువైన సమయాన్ని నష్టపోయాను. గత కొద్దిరోజులుగా నేనేదైనా మంచిపని చేశానంటే అది మద్యం మానివేయడమేనని అన్నారు. ఆ తర్వాత 33 ఏళ్లుగా మద్యం ముట్టుకోలేదు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉంటే నా ఇంకా అద్భుతంగా ఉండేది. నేటి యువత కూడా మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండడం వారి జీవితాన్ని మరింత ఆనందంగా చేస్తుంది అని తెలిపారు.