Janasena Akkala Gandhi house arrest: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ లో ఉన్న చెరువులోని బూడిదను వైసీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ. వీటీపీఎస్ నుండి వచ్చే బుడిద ఆ చెరువులో నింపబడడంతో ఆ చెరువుకు బూడిద చెరువు అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, ఆ చెరువులోని బూడిదను వైసీపీ అక్రమంగా తరలిస్తుందని..అందుకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా ఆ చెరువుని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆధారాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు బయలు దేరారు. టీడీపీ-జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
Also read: అభివృద్ధి ఓర్వలేక సీఎం జగన్ పై విమర్శలు: మంత్రి అమర్ నాథ్
అయితే, బూడిద ఆక్రమణలను అధికారులకు, ప్రజలకు ఆధారాలతో చూపడానికి వెళ్తున్న అక్కల గాంధీ నీ పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదంటూ అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం రాజ్యం..ఇదేం రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
బూడిద దోపిడి అరికట్టాలంటూ డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలను రక్షించాలని ఆందోళన చేశారు.ఘటనపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ మాట్లాడుతూ.. ఆ చెరువు ద్వారా వస్తున్న పొల్యూషన్ తో చుట్టుపక్కల ఉన్న 8 ఊర్లు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.