Rajinikanth : ప్రతీ హిందువు కల అయోధ్య రామ మందిర నిర్మాణం.దశాబ్దాలుగా ఎదురు చూస్తోన్న శుభసమయం ఆసన్నమయింది. జనవరి 22 న అయోధ్య రామాలయం అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది. ప్రపంచం నలుమూలలనుంచి అతిరథమహారధులు , పండితులు , ఆధ్యాత్మిక వేత్తలు , స్వామీజీలు ఈకార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఇప్పటికే అందరికి ఆహ్వాన పత్రికలు పంపించడం కూడా జరిగింది. ఈక్రమంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ కు ఆహ్వానం అందింది.
రజనీని స్వయంగా ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రజనీతో పాటు ఆయన సతీమణి లత, సోదరుడు సత్యనారాయణ కూడా వెళ్లనున్నారు. ఈ కుంభాభిషేక వేడుకకు హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్వాహకులు రజనీకాంత్ కు స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. రజనీలో ఉన్న ఆధ్యాత్మిక కోణం గురించి అందరికి తెల్సిందే. అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తూ ఉండటం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ వేడుకలకు రజనీకి ఆహ్వానం అందటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వేడుకలు ముగిసిన అనంతరం రజనీ 23వ తేదీన చెన్నైకు చేరుకుంటారు.
8 వేల మంది హాజరవుతుండగా వీరిలో 3,500 మంది సాధువులు
ఈ కుంభాభిషేక కార్యక్రమానికి 8 వేల మంది హాజరవుతుండగా వీరిలో 3,500 మంది సాధువులు ఉన్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు ప్రత్యేక రైళ్ళను కూడా నడపనున్నారు.ఇక… పాల్గొంటున్న 8 వేల మంది విశిష్ట అతిధులకు భోజన వసతి ఏర్పాట్లను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.,
ALSO READ::Guntur Kaaram pre release event: గుంటూరు కారం ప్రి రిలిజ్ వాయిదా పడింది ..కొత్త డేట్ ఎప్పుడంటే.!!