Jagan kosam siddham : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన హోరాహోరీగా క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. అయితే, సిద్ధమంటూ ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టింది. “జగన్ కోసం సిద్ధం” పేరుతో మరో ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. మేనిఫెస్టోను ఇంటింటికీ తీసుకెళ్లడమే “జగన్ కోసం సిద్ధం” టార్గెట్ అని తెలుస్తోంది. పార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఇంటింటికీ మేనిఫెస్టో గురించి వివరించనున్నారు.