Megastar chiranjeevi మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి అంటే టక్కున గుర్తొచ్చే సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి. తెలుగు సినిమా రికార్డ్స్ తిరగ రాసిన ఈ సినిమా ఎప్పటికీ ఎవర్గ్రీన్. ఈ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ఓ పెద్ద పండగే.ఇలాంటి గ్లామర్ కాంబోలో ఓ మూవీ మధ్యలో ఆగిపోయింది అంటే నమ్మశక్యంగా లేదు కదా . యస్..ఇది నిజం.
శ్రీదేవి స్వంత నిర్మాణ సంస్థ లతా ప్రొడక్షన్స్ …35 ఏళ్ల క్రితం మొదలైన సినిమా
చిరు, శ్రీదేవి కలిసి తక్కువ సినిమాల్లోనే నటించినా తన హీరోయిన్స్ అందరికంటే శ్రీదేవి అంటే ఎక్కువ అభిమానం చిరంజీవికి. ఇలాంటి అద్భుతమైన కాంబోలో ఓ సినిమా మొదలై మధ్యలోనే ఆగిపోయింది. అదీ కూడా శ్రీదేవి సొంత సినిమా కావడం విశేషం. 35 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే.. హిందీలో తనకు మంచి మార్కెట్ ఉన్నప్పటికీ తెలుగులోనే సొంత సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు శ్రీదేవి..తన చెల్లెలు శ్రీలత పేరు మీద లతా ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. తల్లి రాజేశ్వరి అయ్యప్పన్ నిర్మాత. శ్రీదేవి సమర్పకురాలు. మణిరత్నం తెరకెక్కించిన మౌనరాగం చిత్రంలోని ప్లాష్ బ్యాక్ స్పూర్తితో యండమూరి వీరేంద్రనాథ్ కథ తయారు చేశారు. మంచి పాటలతో మ్యూజికల్ లవ్ స్టోరీ చేయాలనేది శ్రీదేవి ఆలోచన.అప్పటికే టాలీవుడ్లో నంబర్ వన్ స్థానం లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో హీరోగా చేస్తే … ఈ ప్రాజెక్ట్ కి హైప్ వస్తుందని తన తల్లిని వెంటపెట్టుకుని చిరంజీవి ఇంటికి వెళ్లారు శ్రీదేవి. ఏడు పాటలతో బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి ముంబాయి కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కాంబినేషన్లో ఈ సినిమా తీయాలి అనుకుంటున్నట్లుగా శ్రీదేవి చెప్పగానే.. ఓకే అన్నారు చిరంజీవి.
పాటతో మొదలయిన షూటింగ్ .. అతిరధ మహారధులు హాజరు
డిసెంబర్ 6న సాయంత్రం 5 గంటలకు 15 నిమిషాలకు ఎవిఎం స్టూడియోలో జరిగిన చిత్ర ప్రారంభోత్సవానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ హాజరయ్యారు. అలాగే కమల్ హాసన్, రాధిక కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వేటూరి రాసిన అందం చందం ఎంతో.. పాట చిత్రీకరణతో షూటింగ్ ప్రారంభమైంది. 10వ తేదీ వరకు జరిగిన షూటింగ్ తో పాట పూర్తైంది. ఆ తర్వాత ముంబాయిలో పాటల రికార్డింగ్ చేశారు. శ్రీదేవి దగ్గర బొల్డంత మ్యూజిక్ కలెక్షన్ ఉండేది. తనకు ఎలాంటి పాటలు కావాలో మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి దగ్గరుండి పాటలు రికార్డ్ చేయించుకున్నారు.
షూటింగ్ టైంలో భారీ క్రేజ్.. ఇంతలో కథపై కొన్ని అనుమానాలు
సినిమా రెండో షెడ్యూల్ లో కొన్ని సీన్స్ చిత్రీకరించారు. నిర్మాణ సమయంలోనే ఈ సినిమాకి ఎంతో క్రేజ్ వచ్చింది. షూటింగ్ టైంలోనే డైరెక్టర్ కోదండరామిరెడ్డి దగ్గరకు చాలా మంది బయ్యర్లు వచ్చి అడిగేవారట. ఆ క్రేజ్ చూసిన తర్వాత కోదండరామిరెడ్డికి సందేహం కలిగింది. చాలా కాలం తర్వాత చిరంజీవి, శ్రీదేవి కలిసి నటిస్తున్నారు. పైగా శ్రీదేవి సొంత చిత్రం. జనం అంచనాలను అందుకోలేకపోతే.. బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకే శ్రీదేవి దగ్గరకు వెళ్లి.. అమ్మా మనం ఎన్నుకున్న కథ పై కొన్ని అనుమానాలు ఉన్నాయ్ ఏం చేద్దామని అడిగారు కోదండరామిరెడ్డి. సాంగ్స్ బాగా వచ్చాయి. సబ్జెక్ట్ గురించి నాకు తెలియదు. కొన్నాళ్లు షూటింగ్ ఆపేసి వేరే కథతో సినిమా తీద్దామని చెప్పారట శ్రీదేవి. చిరంజీవితో ఓ మాట చెప్పి షూటింగ్ ఆపేశారు. తర్వాత చాలా మంది రచయితలతో కూర్చొని చర్చలు జరిపారు. ఒక దశలో మిస్టర్ ఇండియా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలి అనుకున్నారు. చిరంజీవి కూడా ఆ సినిమా చూశారు. లెంగ్త్ ఎక్కువుగా ఉందని అందరూ అనుకున్నారు. చివరికి కథ కుదరక సినిమాను శాశ్వతంగా ఆపేశారు.ఇలా..చిరు, శ్రీదేవి కాంబోలో శ్రీదేవి నిర్మాతగా షూటింగ్ మొదలు పెట్టిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ALSO READ:HAPPY NEW YEAR 2024 న్యూ ఇయర్లో ఇలా చేయండి.. ఖచ్చితంగా మీ సంతకం ఆటోగ్రాఫ్ అవడం ఖాయం